సాక్షి, న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్‌లో స్ధూల జీఎస్టీ వసూళ్లు గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే 2.67 శాతం తగ్గి రూ 91,916 కోట్లుగా నమోదయ్యాయి. ఈ మొత్తంలో కేంద్ర జీఎస్టీట రూ 16,630 కోట్లు కాగా, రాష్ట్ర జీఎస్టీ రూ 22,598 కోట్లు, రూ 45,069 ఉమ్మడి జీఎస్టీ వసూళ్లుగా రికార్డయ్యాయని అధికారులు వెల్లడించారు. రూ 7620 కోట్లు సెస్‌గా రాబట్టినట్టు తెలిపారు. ఉమ్మడి జీఎస్టీ వసూళ్ల నుంచి ప్రభుత్వం రూ 21,131 కోట్లు సీజీఎస్టీగా, రూ 15,121 కోట్లను రాష్ట్ర జీఎస్టీగా సెటిల్ చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సెప్టెంబర్‌లో జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ 37,716 కోట్లు, రాష్ట్రాలకు రూ 37,719 కోట్లు సమకూరాయని తెలిపింది. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ కాలానికి జీఎస్టీ వసూళ్లు 7.82 శాతం మేర పెరగ్గా, దిగుమతులపై జీఎస్టీ తగ్గుముఖం పట్టిందని మొత్తం జీఎస్టీ వసూళ్లు 4.9 శాతం పెరిగాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment