100లో 85 లావాదేవీలు డిజిటల్‌లోనే
♦ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే వెల్లడి
♦ తెలంగాణలో 200వ శాఖ...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు పుణ్యమా అని హెచ్‌డీఎఫ్‌సీలో జరిగే ప్రతి వంద లావాదేవీల్లో 85 డిజిటల్‌లోనే జరుగుతున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సౌత్ హెడ్ మధుసూదన్ హెగ్డే చెప్పారు. ఎలక్ట్రానిక్ లావాదేవీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఎన్ని ప్రకటించినా సరే 100 శాతం లావాదేవీలు డిజిటల్ రూపంలో జరపలేమని పేర్కొన్నారు. గురువారమిక్కడ 200వ బ్రాంచ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందులో 101 హైదరాబాద్‌లో మిగిలినవి ఇతర జిల్లాల్లో ఉన్నాయని.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 144 బ్రాంచీలున్నాయని పేర్కొన్నారు.