న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు బొగ్గు బ్లాకుల రద్దు వల్ల దేశంలో ప్రధానంగా మెటల్, మైనింగ్, విద్యుత్ రంగాల సంస్థలపై అత్యంత ప్రతికూల ప్రభావం ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. అందులోనూ బొగ్గు స్కామ్ కేసులో పేర్లున్న నవీన్ జిందాల్ కంపెనీ జిందాల్ స్టీల్ అండ్ పవర్(జేఎస్‌పీఎల్), ఆదిత్య బిర్లా గ్రూప్‌నకు చెందిన హిందాల్కోలపై మరింత ఎఫెక్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు.
జేఎస్‌పీఎల్‌కు 1993 నుంచి మొత్తం ఆరు బొగ్గు బ్లాకులను కేటాయించారు. స్పాంజ్ ఐరన్ ప్లాంట్లతో పాటు 1,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల కోసం బ్లాకులను తీసుకుంది. కంపెనీ వీటి ద్వారా మొత్తం 12 మిలియన్ల బొగ్గును ఉత్పత్తి చేస్తోంది. ఇప్పుడు ఈ బ్లాకులను వెనక్కితీసుకోవడం వల్ల ఒడిశాలో ఉత్కల్ బీ-1 బొగ్గు గని లెసైన్సులను చేజిక్కించుకునే పక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి. అంగుల్‌లో నిర్మించతలపెట్టిన ఉక్కు-విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు ఈ మైన్ చాలా కీలకమని ఒక బ్రోకరేజి సంస్థ పేర్కొంది.
ఇక ఒడిశాలోనే హిందాల్కోకు చెందిన తాలబిరా-1 బొగ్గు గని లెసైన్స్ కూడా ఇప్పుడు రద్దయ్యే వాటిలో ఉంది. కంపెనీ బొగ్గు అవసరాల్లో మూడోవంతు(ఏటా 2.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి) ఇక్కడి నుంచే లభిస్తోంది. అంతేకాకుండా, మాహన్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన 3.59 లక్షల టన్నుల సామర్థ్యంగల సెల్టర్‌పైనా నీలినీడలు అలముకోనున్నాయి. ఎస్సార్ పవర్ భాగస్వామ్యంతో హిందాల్కోకు దీనికోసం ప్రభుత్వం సొంత బొగ్గుగనిని కేటాయించింది. ఇది కూడా రద్దుకానుంది.
మెటల్, మైనింగ్‌పై అధిక ప్రభావం
Published Thu, Sep 25 2014 12:44 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement