న్యూఢిల్లీ: బొగ్గు గనుల కేటాయింపుల అక్రమాలపై నమోదైన కేసుల్లో ట్రయల్ కోర్టుల మధ్యంతర ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో మాత్రమే సవాలు చేయాలని అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. ప్రత్యేక కోర్టుల మధ్యంతర ఉత్తర్వులపై ఏదైనా విజ్ఞప్తి లేదా స్టే కోసం సుప్రీంకోర్టుకే రావాలని జూలై 25, 2014న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పులు చేయబోమని ధర్మాసనం తేల్చిచెప్పింది.
ఈ కేసులు భారీ అవినీతికి సంబంధించినవి, బొగ్గు గనుల కేటాయింపు విధానాల్ని కలుషితం చేశారని, అందువల్ల ఇతర సాధారణ కేసుల్లాగా కాకుండా ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరముందని జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని జస్టిస్ జోసఫ్ కురియన్, జస్టిస్ కేకే సిక్రీల త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. అక్రమాల తీవ్రత చాలా ఎక్కువగా ఉందని, అప్పటి సీబీఐ డైరక్టర్ రాజీపడినట్లు ప్రాథమికంగా తేలిందని, అందువల్ల ఆయన ప్రవర్తనపై కూడా విచారణకు ఆదేశించామని సుప్రీంకోర్టు తెలిపింది.
‘కింది కోర్టు తీర్పుపై సుప్రీంకే రావాలి’
Published Fri, Jul 14 2017 12:06 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement