ఐస్ క్రీమ్ వార్: అమూల్ పై నిషేధం
రెండు ప్రధాన ఐస్ క్రీమ్ కంపెనీల మధ్య వార్ లో హిందూస్తాన్ యూనీలివరే(హెచ్యూఎల్) నెగ్గింది. హిందూస్తాన్ యూనీలివర్ కంపెనీ వేసిన దావాతో అమూల్ ఐస్ క్రీమ్ యాడ్ పై బాంబై హైకోర్టు నిషేధం విధించింది. అమూల్ కంపెనీ ఉత్పత్తి చేసే ఐస్‌క్రీమ్‌ను ప్రమోట్ చేసుకునే క్రమంలో టీవీలో ఓ కమర్షియల్ అడ్వర్టయిజ్‌మెంట్‌ను ప్రసారం చేస్తోంది. ఈ యాడ్ కస్టమర్లను తప్పుదోవ పట్టిస్తోందంటూ క్వాలిటీ ఐస్ క్రీమ్ ను మార్కెట్ చేస్తున్న హిందూస్తాన్ యూనీలివర్ బాంబై హైకోర్టును ఆశ్రయించింది. హిందుస్తాన్ వేసిన సూట్‌కు మరో సంస్థ వాదిలాల్ ఇండస్ట్రీస్ కూడా మద్దతు తెలిపింది.. నిజమైన పాలతోనే అమూల్ ఐస్ క్రీం తయారవుతోందని, ఇతర ఐస్ క్రీం కంపెనీలు వెజిటేబుల్ ఆయిల్ వినియోగిస్తున్నారని అమూల్ యాడ్ చెప్పడంలో హిందూస్తాన్ యూనీలివర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. తక్షణం ఆ ప్రకటనను నిలిపివేయాలని హిందూస్తాన్ యూనీలివర్ కోరింది.
డాబర్ ఇండియా వెర్సస్ కోల్ గేట్ వంటి పలు ముందస్తు తీర్పులను పరిశీలించిన అనంతరం బాంబై హైకోర్టు అమూల్ యాడ్ లపై నిర్ణయం ప్రకటించిందని ఇండియన్స్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ కేసును విచారించిన జస్టిస్ ఎస్ జే కథవాలా, అమూల్ ప్రకటన మార్పులతో కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలిసింది. వినియోగదారుల మనసులో ఇలాంటి ముప్పులను రేకెత్తించడం ద్వారా ఉత్పత్తిని అసహ్యించుకుంటారిన కథవాలా చెప్పినట్టు పేర్కొంది. భావవ్యక్తీకరణకు స్వేచ్ఛ ఉన్నప్పటికీ, వ్యతిరేక ప్రచారం ద్వారా ప్రత్యర్థి తయారీదారి ఉత్పత్తిని దుర్వినియోగం చేయడం, అసంపూర్తిగా నిందించడం సరియైనది కాదని బాంబై హైకోర్టు పేర్కొంది. అమూల్ యాడ్ తో తమకు 10 కోట్ల నష్టాలు వాటిలినట్టు హిందూస్తాన్ యూనీలివర్ తెలిపింది.