విదేశాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల విక్రయం | ICICI Bank set to raise $500 million by selling dollar bonds | Sakshi
Sakshi News home page

విదేశాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల విక్రయం

Published Tue, Mar 15 2016 1:30 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

విదేశాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల విక్రయం

విదేశాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ బాండ్ల విక్రయం

ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంక్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ అంతర్జాతీయ బాండ్ మార్కెట్ నుంచి 50 కోట్ల డాలర్ల నిధులు సమీకరించనున్నది.   750 కోట్ల డాలర్ల గ్లోబల్ మీడియం టర్మ్ నోట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ పదేళ్ల మెచ్యూరిటీ ఉన్న ఈ 50 కోట్ల డాలర్ల బాండ్ల విక్రయాన్ని చేపట్టింది. ఈ ఏడాది ఈ  తరహా కార్యక్రమాన్ని చేపట్టిన తొలి భారత ఆర్థిక సంస్థగా ఐసీఐసీఐ బ్యాంక్ నిలిచింది. ఈ బాండ్లను ఐసీఐసీఐ బ్యాంక్ తన దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్‌సెంటర్ బ్రాంచ్ ద్వారా విక్రయిస్తోంది. ఈ బాండ్ల విక్రయం సోమవారం రాత్రి ముగియనున్నది. ఈ ఇష్యూకి మూడీస్ సంస్థ బీఏఏ3 రేటింగ్‌ను,  ఎస్ అండ్ పీ సంస్థ బీబీబీమైనస్ రేటింగ్‌ను ఇచ్చాయి. ఈ రెండు రేటింగ్‌లు ఇన్వెస్ట్‌మెంట్ గ్రేడ్‌ను సూచిస్తాయి.  తన ఆర్థిక లక్ష్యాలను సాధించే సత్తా ఆ సంస్థకు ఉందని  ఈ రేటింగ్‌లు పేర్కొంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement