న్యూఢిల్లీ: ఉద్దీపన చర్యల ప్రభావం పూర్తి స్థాయిలో ప్రతిఫలించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 5 శాతానికన్నా కాస్త తక్కువగానే ఉండవచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఒక నివేదికలో పేర్కొంది. బలహీన ఆర్థిక రంగ పరిస్థితులు.. భారత వృద్ధి వేగంపై ప్రతికూల ప్రభావం చూపనున్నాయని తెలిపింది. మొండిబాకీల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు కొత్తగా రుణాలివ్వలేని పరిస్థితి కూడా ఇందుకు కారణం కానుందని పేర్కొంది.
అటు బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభం .. వాటికి రుణాలిచ్చిన బ్యాంకులకు కూడా వ్యాపించే రిస్కులు పొంచి ఉన్నాయని, రుణ వృద్ధిపై ఇవి కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ తెలిపింది. ఆర్థిక వృద్ధి మందగించడం వల్ల తయారీ రంగానికి, పెట్టుబడులకు ప్రోత్సాహమిచ్చే చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని వివరించింది. 2019–20 వృద్ధి అంచనాలను ఇటీవలే ఆర్‌బీఐ 6.1% నుంచి 5%కి కుదించిన నేపథ్యంలో తాజా ఐహెచ్‌ఎస్ మార్కిట్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment