రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి సీఎన్‌బీసీ టీవీ18 ‘ఐకానిక్ బిజినెస్ లీడర్ ఆఫ్ ద డికేడ్’ అవార్డును అందించిన నిర్మలా సీతారామన్
భారత్ ఆర్థిక వృద్ధి రేటు మూడవ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదుకావడాన్ని ఆర్థిక రంగంలో ‘‘స్థిరత్వం’’గా ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు ఇది ఒక శుభ సంకేతమనీ విశ్లేషించారు. సీఎన్‌బీసీ టీవీ 18 బిజినెస్ లీడర్‌షిప్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ, వృద్ధి రేటు మరికొంతకాలం ఇదే స్థాయిలో స్థిరంగా ఉండే వీలుందని పేర్కొన్నారు. కోవిడ్–19 వైరస్ విషయంలో తక్షణం భయపడాల్సింది ఏదీ లేదన్నారు. అయితే సమస్యలు మరో రెండు, మూడు వారాలు కొనసాగితే మాత్రం సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment