చైనాను బీట్‌ చేస్తాం.. | India to become fastest growing large economy  | Sakshi
Sakshi News home page

చైనాను బీట్‌ చేస్తాం..

Published Sun, Jan 21 2018 6:13 PM | Last Updated on Sun, Jan 21 2018 6:13 PM

India to become fastest growing large economy  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌ ఈ ఏడాది అత్యంత వేగంగా ఎదిగే ఆర్థిక వ్యవస్థగా చైనాను అధిగమిస్తుందని, మన స్టాక్‌ మార్కెట్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఈక్విటీ మార్కెట్‌గా అవతరిస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచ దేశాలు అతితక్కువ వృద్ధి సాధిస్తున్న క్రమంలో భారత్‌ అందుకు విరుద్ధంగా పటిష్ట దీర్ఘకాల వృద్ధితో దూసుకుపోతుందని శాంక్టమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక పేర్కొంది.

అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు 2-3 శాతం వృద్ధి సాధించడానికి ఇబ్బందులు పడుతుంటే భారత్‌ 7.5 శాతం వృద్ధి రేటుపై దృష్టిసారించిందని నివేదిక స్పష్టం చేసింది. వృద్ధిరేటులో చైనాను అధిగమిస్తుందని అంచనా వేసింది. ఇక భారత్‌ స్టాక్‌ మార్కెట్‌ నుంచి 6-8 శాతం కన్నా అధిక వృద్ధిని మదుపుదారులు ఆశించవచ్చని పేర్కొంది. భారత్‌లో ఆధార్‌, జన్‌థన్‌, నోట్ల రద్దు, జీఎస్‌టీ వంటి సంస్కరణలతో నూతన సమ్మిళిత మౌలిక వసతులు చోటుచేసుకుంటున్నాయని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement