జీడీపీకి వ్యవ‘సాయం’..! | India clocks GDP growth at 7.3% in September quarter | Sakshi
Sakshi News home page

జీడీపీకి వ్యవ‘సాయం’..!

Published Thu, Dec 1 2016 12:31 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM

జీడీపీకి వ్యవ‘సాయం’..!

జీడీపీకి వ్యవ‘సాయం’..!

సెప్టెంబర్ క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి రేటు 7.3 శాతం
జూన్ త్రైమాసిక వృద్ధి 7.1 శాతం కంటే అధికం
గతేడాదితో పోల్చుకుంటే 30 బేసిస్ పారుుంట్ల తగ్గుదల
సాగు, సేవలు, వాణిజ్య రంగాల్లో ఆశాజనక పరిస్థితులు
క్షీణించిన పెట్టుబడులు... మైనింగ్‌లో వృద్ధి మైనస్

 న్యూఢిల్లీ: భారత్ మరోసారి ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై - సెప్టెంబర్ త్రైమాసికం(క్యూ2)లో 7.3 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఇదే త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.6 శాతంతో పోలిస్తే క్షీణించినట్టు తెలుస్తోంది. అరుుతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికం(క్యూ2)లో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే సానుకూల వృద్ధి నమోదైంది.

సాగు రంగంలో ఆశాజనక పరిస్థితులు, సేవలు, వాణిజ్య రంగాల పనితీరు మెరుగవడం వృద్ధి రేటు పెరగడానికి తోడ్పడింది. నోట్ల రద్దు ప్రభావంతో మూడో త్రైమాసికంలో ఈ స్థారుులో వృద్ధి రేటు కొనసాగకపోవచ్చనే అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర గణాంకాల విభాగం బుధవారం ఈ మేరకు వివరాలను వెల్లడించింది. వృద్ధి రేటులో 2015లో చైనాను అధిగమించిన మన దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే.

 సెప్టెంబర్ త్రైమాసికంలో రంగాల వారీగా...
ప్రజా పరిపాలన, రక్షణ, ఇతర సేవలైన ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, వృత్తి నిపుణుల సేవలు... తయారీ, వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్, బ్రాడ్ కాస్టింగ్ సేవల రంగాల్లో 7 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదైంది.

వ్యవసాయ రంగం, అటవీ ఉత్పత్తులు, మత్స్య రంగాల వృద్ధి మెరుగైంది. 3.3 శాతానికి చేరుకుంది. ఇది అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 2 శాతమే.

ఇక మైనింగ్, క్వారీరుుంగ్ వృద్ధి మైనస్ 1.5 శాతానికి పడిపోరుుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో 5 శాతం మేర వృద్ధిని నమోదైంది.

విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు 3.5 శాతంగా ఉండగా క్రితం సంవత్సరంలో ఇదే సమయంలో నమోదైన 7.1 శాతంతో పోలిస్తే క్షీణించింది.

నిర్మాణ రంగం మాత్రం మెరుగుపడింది. తాజాగా ఈ రంగలో 3.5 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఇదే కాలంలో వృద్ధి కేవలం 0.8 శాతం మాత్రమే.

తయారీ రంగం మాత్రం 9.2% నుంచి 7.5%కి దిగి వచ్చింది.

 జీవీఏ 7.1 శాతం
మూల ధర ఆధారంగా లెక్కించే గ్రాస్ వేల్యూ యాడెడ్ (జీవీఏ) సెప్టెంబర్ త్రైమాసికంలో 7.1 శాతంగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో నమోదైన 7.3 శాతం కంటే తగ్గినట్టు తెలుస్తోంది. జీడీపీ వృద్ధి రేటును కొత్త విధానంలో మార్కెట్ ధరల ఆధారంగా లెక్కిస్తున్న విషయం తెలిసిందే. అదే జీవీఏ మాత్రం ఫ్యాక్టరీ ధరల ఆధారంగా లెక్కించే రేటు. జీవీఏ, ఉత్పత్తులపై పన్నులు కలిపి ఈ మొత్తంలోంచి సబ్సిడీలను తీసివేయగా వచ్చేదే జీడీపీ రేటు.

 స్థిరమైన ధరల ప్రకారం

జీడీపీ విలువ రూ.29.63 లక్షల కోట్లు. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.27.62 లక్షల కోట్లు.

ప్రస్తుత ధరల ప్రకారం ప్రభుత్వ తుది వినియోగ వ్యయం (జీఎఫ్‌సీఈ) రూ.5.15 లక్షల కోట్లు. క్రితం సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.4.27 లక్షల కోట్లు.

స్థిరమైన ధరల ప్రకారం చూస్తే ప్రభుత్వ తుది వినియోగ వ్యయం రూ.3.84 లక్షల కోట్లు. 

పెట్టుబడులు క్షీణించడం ఆందోళనకరం..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి అర్ధభాగానికి వచ్చిన గణాం కాలు చక్కని, స్థిరమైన పనితీరును తెలియజేస్తున్నారుు. రెండో అర్ధ భాగం విషయంలో మాత్రం అనిశ్చితి నెలకొంది. దీన్ని విశ్లేషించాల్సి ఉంది. పెట్టుబడులను సూచించే గ్రాస్ ఫిక్స్‌డ్ కేపిటల్ ఫార్మేషన్ (జీఎఫ్‌సీఎఫ్) క్షీణించడం ఆందోళన కలిగించే అంశం’’ అని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో జీఎఫ్‌సీఎఫ్ ప్రస్తుత రేట్ల ప్రకారం మైనస్ 3.2 శాతం... స్థిరమైన ధరల ప్రకారం మైనస్ 5.6 శాతంగా నమోదైంది. అంతకుముందు సంవత్సరం రెండో త్రైమాసికంలో ఈ రేట్లు 7.5%, 9.7 శాతంగా ఉన్నారుు. రెండో త్రైమాసికంలో పెట్టుబడులు గణనీయంగా తగ్గిపోవడం ఆందోళనకరమని, దీన్ని పరిశీలించాల్సి ఉందని సుబ్రమణియన్ అన్నారు.

ముందున్నవి సవాళ్లు...
న్యూఢిల్లీ: జీడీపీ వృద్ధి రేటు ఈ ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో త్రైమాసికంలో పెరిగినప్పటికీ... నోట్ల రద్దు కారణంగా వినియోగం పడిపోవడం వల్ల భవిష్యత్తులో సవాళ్లు పొంచి ఉన్నాయని పారిశ్రామిక రంగం, నిపుణుల నుంచి ఆందోళనలు వ్యక్తమయ్యారుు.

అంచనా కంటే తక్కువే..
రెండో త్రైమాసికంలో జీడీపీ 7.3%, జీవీఏ 7.1% అన్నది అంచనాల కంటే తక్కువే. ప్ర స్తుతం పెద్ద నోట్లను రద్దు చేసినందువల్ల జీడీపీ/జీవీఏ వృద్ధి రేటు మా అం చనా ప్రకారం 7.8% కంటే మరింత తక్కువగా ఉంటుంది.
- సునీల్ కనోరియా, ఇండియా రేటింగ్‌‌స ప్రధాన ఆర్థిక వేత్త

నోట్ల రద్దు ప్రతికూలం..
రానున్న త్రైమాసికంలో వృద్ధి రేటుకు ప్రస్తుత నోట్ల రద్దు ప్రతికూలంగా మారుతుంది. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్

మరింత తగ్గుదల..
నోట్ల రద్దు తర్వాత జీడీపీ, జీవీఏ అంచనాలను 2017 సంవత్సరానికి 7.5%, 7.3%కి తగ్గిం చగా... ప్రస్తుత డేటా ప్రకారం వృద్ధి రేటు మా అంచనాల కంటే తక్కువే ఉండొచ్చు. - అదితి నాయర్, ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త

ఎన్నో సవాళ్లు..
డీమోనిటైజేషన్, బ్రెగ్జిట్, చైనా ఆర్థిక రంగంలో మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల రక్షణాత్మక విధానాలు, పరిష్కారం కాని ఎన్‌పీఏల రూపంలో దేశ ఆర్థిక వృద్ధికి సవాళ్లు పెరిగిపోయారుు.  - డీఎస్ రావత్, అసోచామ్ సెక్రటరీ జనరల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement