న్యూఢిల్లీ : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్) ర్యాంకింగ్‌లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంది. తాజా నివేదిక ప్రకారం దక్షిణ ఆసియాలో ఇండియా టాప్ ర్యాంక్ సాధించింది. గ్లోబల్ మోస్ట్ కాంపిటీటివ్‌నెస్ ర్యాంకింగ్‌లో 40వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సింగపూర్ టాప్ ప్లేస్‌లో ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ఆర్ధిక వ్యవస్థగా నిలవగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించిందని నివేదించింది. అంతేకాదు చైనా, ఇండియా, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు తమ హవాను కొనసాగిస్తాయని తెలిపింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇచ్చిన ఈ ఏడాది గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్(జీసీఐ) రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ 40వ స్థానంలో నిలిచింది. పోటీతత్వ సూచికలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 137 దేశాలు ఉండగా భారత్‌కు 40వ ర్యాంక్ దక్కింది. స్విట్జర్లాండ్, అమెరికా, సింగపూర్ దేశాలు టాప్ త్రీ ఆర్థిక దేశాలుగా కొనసాగుతున్నాయి. బ్రిక్స్ దేశాల్లో భారత్ మూడవ బెస్ట్ ఎకనామిక్ కంట్రీగా నిలిచింది. బ్రిక్స్ భాగస్వామ్య దేశాలైన .. చైనాకు 27వ స్థానం, రష్యాకు 38వ స్థానం వచ్చింది.
భారత్‌లో మౌలిక సదుపాయాలు, ఉన్నత విద్య, లేబర్ మార్కెట్ పెరిగిందని రిపోర్ట్ తెలిపింది. విశ్వ పోటీ సూచీకలో బ్రెజిల్, టర్కీ దేశాలు క్రమంగా బలహీనపడ్డాయి. కానీ చైనా, ఇండియా, ఇండోనేషియా దేశాలు మాత్రం బలపడుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే భారత్ స్థానం ఒక పొజిషన్ తగ్గింది.12 అంశాల ఆధారంగా గ్లోబల్ కాంపిటీటివ్‌నెస్ ఇండెక్స్‌ను తయారు చేస్తారు