WEF report
-
విమానంలో లీకేజీ.. ప్రయాణానికి తప్పని తిప్పలు
బోయింగ్ విమానాలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మక విమానయాన సంస్థలు వినియోగిస్తున్నాయి. అయితే వాటిలో తరచూ వస్తున్న సాంకేతికలోపాలతో ప్రయాణికులు, సంస్థ యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల బోయింగ్ విమానం గాల్లోనే ఉండగా డోర్ ఊడిపోయిన ఘటనలు, టేకాఫ్ అయిన కాసేపటికే కాక్‌పిట్ అద్దాలు పగలడం చూశాం. ఈ తిప్పలు కేవలం సామాన్యులకే కాదు ఏకంగా అగ్రరాజ్యంలో దౌత్యవేత్తకు తప్పలేదు. తాజాగా అమెరికా దౌత్యవేత్త ఆంటోనీ బ్లింకెన్ దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సదస్సు నుంచి తిరిగివెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన ప్రయానిస్తున్న బోయింగ్ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌లో లోపాన్ని గుర్తించారు. అందులో ఆక్సిజన్ లీకేజీ అవుతున్నట్లు సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఆ సమాచారాన్ని ఆంటోనీకి చేరవేశారు. చాలా సమయం వరకు సిబ్బంది సమస్యను పరిష్కరించకపోవడంతో తన అమెరికా ప్రయాణం ఆలస్యమైనట్టు మీడియా కథనాలు తెలిపాయి. అయితే గతంలో ఈ విమానంలో ఇదే సమస్య తలెత్తినట్లు చెప్పారు. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత విలువైన టాప్10 కరెన్సీలు ఇవే.. సెప్టెంబరులో జస్టిన్ ట్రూడోకు ఇలాంటి సంఘటన ఎదురైంది. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తన విమానంలో మెకానికల్ లోపం కారణంగా జీ20 శిఖరాగ్ర సమావేశం తర్వాత భారతదేశంలోని న్యూదిల్లీలో చిక్కుకున్నారు. అలస్కా విమాన ఘటన తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్ 9 విమానాలను అమెరికాకు చెందిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) ఆకాశంలోకి ఎగరనీయకుండా కట్టడి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల వీటిపై ఆంక్షలను మరింత కాలం పొడిగించింది. యునైటెడ్ స్టేట్స్ ఏవియేషన్ రెగ్యులేటర్ కొత్త భద్రతా తనిఖీల కోసం బోయింగ్ 737 మాక్స్ 9 విమానాల పర్యవేక్షణను కఠినతరం చేయబోతున్నట్లు గతంలోనే తెలిపింది. -
రూ.37,870 కోట్ల పెట్టుబడితో 6 కంపెనీలు సిద్ధం!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన సందర్భంగా బుధవారం పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకొన్నాయి. అదానీ గ్రూప్‌సహా ఆరు కంపెనీలు మొత్తం రూ.37,870 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం నేతృత్వంలోని బృందం రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించేందుకు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. అదానీ గ్రూప్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో రూ.12,400 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. సీఎం రేవంత్‌తో గౌతమ్ అదానీ సమావేశమైన అనంతరం ఏరోస్పేస్, డిఫెన్స్ సీఈవో ఆశిష్‌రాజ్ వంశీ అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశారు. తెలంగాణలో పెట్టుబడులతోపాటు యువతకు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు గౌతం అదానీ ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని అదానీ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ అనుబంధ సంస్థ జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ తెలంగాణలో రూ.9,000 కోట్ల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యంగల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో ఆ సంస్థ అవగాహన ఒప్పందం కుదిరింది. తెలంగాణలో ఔషధాల ఆవిష్కరణ, అభివృద్ధి సేవలను విస్తరించేందుకు ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందులో భాగంగా రూ.2,000 కోట్ల కొత్త పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణలో రూ.8,000 కోట్ల పెట్టుబడితో ఆర్ అండ్ డీతోపాటు గిగా సేల్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో గోడి ఇండియా కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో మహేష్ గోడి సమావేశమయ్యారు. తెలంగాణలో రూ.5,200 కోట్లతో డాటా సెంటర్లను నెలకొల్పేందుకు వెబ్‌వర్క్స్ ముందుకొచ్చింది. డాటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటేన్ అనుబంధ సంస్థ వెబ్‌వర్స్. ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్‌వర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీ సీఎంతో సమావేశమై తెలంగాణలో డాటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ నాదిర్ గోద్రెజ్ రేవంత్‌రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రూ.1,000 కోట్లతో కెమికల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోద్రెజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఖమ్మంలో తొలిదశలో రూ.270 కోట్లతో దేశంలోనే అతిపెద్ద సమీకృత ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు అప్పు ఇవ్వాలంటూ సూచన.. ఎందుకంటే.. రాష్ట్ర పెట్టుబడి ఒప్పందాలు (రూ.కోట్లలో) అదానీ గ్రూప్ : రూ.12,400 కోట్లు ఆరాజెన్ : రూ.2,000 కోట్లు జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ : రూ.9,000 కోట్లు గోడి ఇండియా : రూ.8,000 కోట్లు వెబ్ వర్స్ : రూ.5,200 కోట్లు గోద్రెజ్ : రూ.1,270 కోట్లు -
లింగ సమానత్వం.. 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135!
న్యూఢిల్లీ: లింగ సమానత్వం విషయంలో ఐస్లాండ్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్ నిలిచాయి. మొత్తం 146 దేశాల సూచికలో భారత్ ర్యాంక్ 135! అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, కాంగో, ఇరాన్, చాద్ తదితర దేశాలు అట్టడుగులు స్థానాల్లో నిలిచాయి. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) ‘వార్షిక జెండర్ గ్యాప్ రిపోర్ట్–2022’ను బుధవారం చేసింది. లింగ సమానత్వంలో ప్రపంచ దేశాలకు ర్యాంక్‌లను కేటాయించింది. లింగ అంతరం పూర్తిగా సమసిపోవడానికి మరో 132 ఏళ్లు పడుతుందని అంచనా వేసింది. లింగ సమానత్వంలో భారత్ వెనుకంజలో ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవహారాలు, ఉద్యోగ–ఉపాధి అవకాశాల్లో వారి భాగస్వామ్యం పెరుగుతుండడం సంతోషకరమని పేర్కొంది. మహిళా ప్రజాప్రతినిధులు తదితరుల సంఖ్యలో పెరుగుదల కన్పించింది. చదవండి: లంకాధ్యక్షుడి జంప్ జిలానీ.. గొటబయ గో! అంటే ముల్లేమూటా సర్దాల్సిందే! -
భారత్‌లో లింగ సమానత్వానికి ఎన్నేళ్లు పడుతుందో తెలుసా?
జెనీవా: భారత్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళ్తున్నా లింగ సమానత్వంలో మాత్రం వెకబడిపోయింది. జెనీవాలోని ప్రపంచ ఆర్థిక వేదిక(డబ్ల్యూఈఎఫ్) 'వార్షిక లింగ అంతర నివేదిక 2022' ప్రకారం భారత్ 135వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఒక స్థానం మెరుగైనా.. ఇంకా అట్టడుగునే కొనసాగుతోంది. ఐలాండ్స్ మరోమారు లింగ సమానత్వంలో తన తొలిస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో ఫిన్లాండ్, నార్వే, న్యూజీలాండ్, స్వీడన్లు ఉన్నాయి. మరో 132 ఏళ్లు.. మొత్తం 146 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. భారత్ అట్టడుగున 135వ స్థానంలో నిలవటంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్ కన్నా అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, ఇరాన్, ఛాడ్ వంటి 11 దేశాలు మాత్రమే వెనబడి ఉన్నాయి. జీవన వ్యయం పెరిగిపోతుంటటం వల్ల ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల మధ్య అంతరం పెరిగిపోతోందని డబ్ల్యూఈఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. దాని ప్రకారం భారత్‌లో స్త్రీపురుషులు సమానంగా మారేందుకు మరో 132 ఏళ్లు(2021లోని 136వ ర్యాంకు ప్రకారం) పడుతుందని అంచనా వేసింది. కరోనా మహమ్మారి సైతం లింగ అంతరంలో ఓ తరం వెనక్కు వెళ్లేలా చేసిందని తెలిపింది. గడిచిన 16 ఏళ్లలో భారత ర్యాంకు 7 స్థానాలు ఎగబాకినా.. ఇంకా అట్టుడుగునే ఉందని ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూఈఎఫ్.' భారత్‌లోని సుమారు 662 మిలయన్ల మంది మహిళ జనాభాతో ప్రాంతీయ ర్యాంకులపై ప్రభావం పడుతోంది. 2021తో పోలిస్తే.. ఆర్థిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం, అవకాశాల్లో మెరుగైనప్పటికీ.. కార్మిక శక్తిలో మరింత కిందకు పడిపోయింది. శాసనకర్తలు, ఉన్నతాధికారులు, మేనేజర్స్ విభాగాల్లో మహిళలు 14.6 శాతం నుంచి 17.6 శాతానికి చేరుకున్నారు. సాంకేతిక, వృత్తి నిపుణుల్లో మహిళలు 29.2 నుంచి 32.9 శాతానికి చేరారు. వారి ఆదాయం పెరిగింది. అయితే.. మగవారితో పోలిస్తే వారికి అందే గౌరవంలో మాత్రం అంకా వెనకబడే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో మగవారి కోసం వారిని తిరస్కరిస్తున్నారు.' అని పేర్కొంది నివేదిక. ఆ విభాగంలో ఊరట.. మహిళల రాజకీయ సాధికారతలో భారత్ 48వ స్థానంలో నిలిచింది. గత యాభై ఏళ్లుగా మహిళలకు రాజకీయాల్లో దక్కుతున్న స్థానం చాలా తక్కువ. దాంతో ఈ ర్యాంకు మరింత పడిపోయినట్లు డబ్ల్యూఈఎఫ్ తెలిపింది. మరోవైపు.. ఆరోగ్యం, జీవన విధానంలో భారత్ 146వ స్థానానికి పరిమితమైంది. లింగ అంతరం 5 శాతానికిపైగా ఉన్న ఐదు దేశాల్లో ఒకటిగా నిలిచింది. అయితే.. భారత్‌కు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రాథమిక పాఠశాలల నమోదులో లింగ సమానత్వంలో టాప్‌లో నిలిచింది. ఇదీ చూడండి: ప్లాస్టిక్‌ను తినేసే 'రోబో ఫిష్'.. సముద్రాల స్వచ్ఛతలో కీలక అడుగు! -
డిజిటల్ టెక్నాలజీ పురోగతితో పర్యావరణ పరిరక్షణ
దావోస్: డిజిటల్ టెక్నాలజీల పురోగతి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను 2050 నాటికి 20 శాతం వరకు తగ్గించగలదని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) అంచనావేసింది. అత్యంత పర్యావరణ ప్రతికూల ఉద్గారాలను వెలువరించే మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్‌లో డిజిటల్ టెక్నాలజీ ఆవశ్యకతను ఉద్ఘాటించింది. యాక్సెంచర్‌తో కలిసి ఈ మేరకు నిర్వహించిన అధ్యయన వివరాలు... నిర్ణయాలు–అమలు మధ్య వ్యత్యాసం పర్యావరణ పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న పిలుపునకు ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. కాలుష్య నివారణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే నిర్ణయాలు–వాటి అమలు మధ్య ఇంకా తీవ్ర వ్యత్యాసం ఉంది. ఈ వ్యత్యాసాన్ని తగ్గించాలి. ఇంకా చెప్పాలంటే ప్రమాదకర ఉద్గారాల తగ్గింపు అవసరమైన చర్యలు 55 శాతం చేపట్టాల్సి ఉండగా, ఈ దిశలో నడిచింది కేవలం 7.5 శాతం కావడం గమనార్హం. ఈ వ్యతాసం తగ్గింపునకు అధిక ఉద్గార రంగాలు ఈ విషయంలో ‘సామర్థ్యం, పునరుత్పాదకత, సుస్థిర నిర్ణయాల’పై పునరాలోచించాల్సిన అవసరం ఉంది. ఆ మూడు రంగాలు కీలకం... మూడు రంగాలు– ఎనర్జీ, మొబిలిటీ, మెటీరియల్స్ విభాగాలు అధిక ఉద్గార రంగాలుగా ఉన్నాయి. 2020 మొత్తం ఉద్గారాల్లో వీటి వెయిటేజ్ వరుసగా 43 శాతం, 26 శాతం, 24 శాతాలుగా ఉన్నాయి. ఈ పరిశ్రమలు తమ కార్యకలాపాలు, నిర్వహణ విషయంలో కాలుష్యాలను తగ్గించడానికి నాలుగు రకాలైన డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించవచ్చు. బిగ్ డేటా అనలిటిక్స్, కృత్రిమ మేధస్సు/మెషిన్ లెర్నింగ్ వంటి నిర్ణయాత్మక సాంకేతికతలు, క్లౌడ్, 6జీ, బ్లాక్‌చెయిన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ వంటి సాంకేతికతలను ప్రారంభించడం, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డ్రోన్లు, ఆటోమేషన్ వంటి సెన్సింగ్, కంట్రోల్ టెక్నాలజీలను ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించుకోవచ్చు. నివేదికలోని మరికొన్ని అంశాలు.. - డిజిటల్ పరిష్కారాలు, కార్బన్–ఇంటెన్సివ్ ప్రక్రియలను మెరుగుపరచడం, భవనాలలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం, పునరుత్పాదక శక్తి వినియోగం, నిర్వహణ, వంటి చర్యల ద్వారా ఇంధన రంగంలో ఉద్గారాలను 8 శాతం వరకు తగ్గించవచ్చు. - మెటీరియల్ రంగంలో డిజిటల్ సొల్యూషన్ లు మైనింగ్, అప్‌స్ట్రీమ్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి. దీనితోపాటు 2050 నాటికి గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు 7% వరకు తగ్గుతాయి. - సాంప్రదాయ ఇంధనం నుంచి గ్రీన్ ఇంధనం వైపునకు మొబిలిటీ రంగం అడుగులు వేయడం ద్వారా ఉద్గారాలను 5 శాతం వరకు తగ్గించవచ్చు. ఈ దిశలో సంబంధిత మౌలిక రంగం పురోగతి అవసరం. - వాయు ఉద్గారాలను తగ్గించడం, ఆర్థిక వృద్ధి ప్రేరణకు డిజిటల్ టెక్నాలజీలను అమలు చేసే కంపెనీలు ఈ విషయంలో మిగిలిన కంపెనీలు, సంస్థలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. - పర్యావరణ పరిరక్షణకు డిజిటల్ సాంకేతికత కంపెనీలకు ఒక మంచి సాధనాలని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ డిజిటల్ ఎకానమీ ప్లాట్‌ఫామ్ స్ట్రాటజీ హెడ్ మంజు జార్జ్ అన్నారు. వ్యాపార పక్రియ, వ్యాలూ చైన్‌లో పారదర్శకత, సామర్థ్యం పెంపులో సాంకేతికత ప్రాధాన్యంత కీలకమని పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికత పురోగతితో పారిశ్రామిక రంగాలు తగిన ప్రయోజనాలు పొందడం ప్రస్తుతం కీలకమని ఆయన సూచించారు. చదవండి: డీకార్బనైజ్డ్ మెకానిజంలో ఏపీ కొత్త ట్రెండ్ సెట్ చేసింది: సీఎం జగన్ -
గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్: భారత్ 28 స్థానాలు ఢమాల్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల పట్ల వివక్ష మరింతగా పెరుగుతోంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) లింగ అసమానతల సూచీలో భారత్ 28 స్థానాలు దిగజారడం ఇందుకు నిదర్శనం. 2021కి సంబంధించి 156 దేశాల జాబితాలో భారత్ 140వ స్థానంలో నిల్చింది. 2020లో భారత్ ర్యాంకు 112గా ఉంది. తాజా నివేదిక ప్రకారం రాజకీయ, ఆర్థిక తదితర రంగాల్లో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోంది. రాజకీయ సాధికారతకు సంబంధించిన అంతర్గత సూచీలో భారత్ 13.5 శాతం మేర క్షీణించింది. మహిళా మంత్రుల సంఖ్య 2019లో 23.1 శాతంగా ఉండగా 2021లో 9.1 శాతానికి పడిపోవడం ఇందుకు కారణం. ప్రొఫెషనల్, టెక్నికల్ ఉద్యోగాల్లోనూ మహిళల వాటా 29.2 శాతానికి తగ్గింది. ఇక ఆర్థికాంశాలపరంగా చూస్తే మహిళలు ఆర్జించే ఆదాయం.. పురుషుల ఆదాయంలో అయిదో వంతే ఉంటోంది. దక్షిణ ఆసియాలో బంగ్లాదేశ్ , నేపాల్ కంటే వెనుకబడి ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ జాబితాలో ఐస్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో ఫిన్లాండ్ నార్వే ఉన్నాయి. కాగా ఆఫ్ఘనిస్తాన్ 156 చివరి స్థానంలో ఉంది. -
‘ఇ - చెత్త’ నిజంగా బంగారమే.. కానీ
ఏటా కాలం తీరిన ఎలక్ట్రానిక్ పరికరాలను వందల టన్నుల్లో పడేస్తున్నాం. ఫలితంగా ఇ-వ్యర్థాలు గుట్టలా పేరుకుపోతున్నాయి. ఇలా నిరుపయోగంగా మారిన ఇ-వేస్ట్‌తో సంవత్సరానికి దాదాపు 4,500 ఈఫిల్ టవర్లను నిర్మించవచ్చట. అంతేనా ఇలా పోగుపడిన ఇ - వేస్ట్ బరువు ఏకంగా 1,25,000 బోయింగ్ 747 జంబో జెట్ల బరువుకు సమానమట. ఇవేవో గాలి కబుర్లు కావు. స్వయంగా దావోస్ వేదికగా నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సులో ఈ నివేదికను వెల్లడించారు. అవును మరి ప్రస్తుతం చేతిలో స్మార్ట్‌ఫోన్.. ఇంట్లో టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు.. ఆఫీసుల్లో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు.. ఇవే కాక బయట మరో సవాలక్ష ఎలక్ట్రానిక్ పరికరాలు. ఇవి లేకపోతే మనకు నిమిషం కూడా గడవని పరిస్థితి. ఉపయోగాలు లేవని కాదు.. అతి వాడకం. వెరసి రోజురోజుకు పెరిగిపోతున్న ఇ-వ్యర్థాలు. వీటిని పునరుపయోగించడం చాలా కష్టమైనదే కాక ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. ఇన్నాళ్లు గ్లోబల్ వార్మింగ్ గురించి ఆందోళన చెందితే.. ఇప్పుడు ఇ-వ్యర్థాలు మరింత భయపెడుతున్నాయి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా పోగవుతున్న వ్యర్థాల్లో ఇ-వేస్ట్ వాటా కేవలం 2 శాతం మాత్రమే. కానీ పర్యావరణానికి కలిగించే హానిలో వీటి వాటా మాత్రం ఏకంగా 70 శాతం అంటే ఇ-వేస్ట్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈనెల 21 నుంచి ఐదు రోజుల పాటు జరిగిన డబ్ల్యూఈఎఫ్ వార్షిక సదస్సులో ఈ ఇ-వ్యర్థాల గురించి చర్చించారు. పెరిగిపోతున్న ఇ-వేస్ట్‌ను తగ్గించేందుకు తీసుకునే చర్యలే కాక.. సులభంగా రీసైకిల్ చేసి రీయూజ్ చేసే మార్గాల గురించి పరిశోధనలు పెంచాలని నిర్ణయించారు. ఆ వివరాలు.. సాంకేతికతో పాటే పెరుగుతున్న వ్యర్థాలు.. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందిన కొద్ది.. కొత్త కొత్త ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం కూడా పెరుగుతుంది. 2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1.46 బిలియన్ల స్మార్ట్ఫోన్లు ఉంటే.. 2020నాటికి స్మార్ట్ఫోన్లు వినియోగించే వారి సంఖ్య 2.87 బిలియన్లకు చేరనుందట. ఇంతమందికి మొబైల్ ఫోన్ సౌకర్యాలు కల్పించాలంటే సెల్ టవర్ల సంఖ్య కూడా పెంచాలి. అంటే నెట్వర్కింగ్ పరికరాలను కూడా పెంచాలి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఎంత టెక్నాలజీ పెరిగితే అంత ఎక్కువ మొత్తంలో ఇ-వేస్ట్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు మనం వాడే ప్రతి ఎలక్ట్రాననిక్ పరికరం ఏదో ఒక రోజు నిరుపయోగంగా మారుతుంది. ఫలితం ప్రస్తుతం ఉన్న చెత్తను తగ్గించకపోగా.. మరికొంత పెంచుతున్నట్లే కదా. చెత్త ‘బంగార’మే.. చెత్త బంగారం ఏంటి అనుకోకండి. ఇ-వ్యర్థాలు నిజంగా బంగారు కొండలే. మనం వాడే స్మార్ట్ఫోన్ల తయారీలో చాలా తక్కువ మొత్తంలో బంగారం వాడతారనే విషయం తెలిసిందే. 100 టన్నుల బంగారు ధాతులో లభించే బంగారం కంటే.. 100 టన్నుల స్మార్ట్ఫోన్లలో లభించే బంగారం ఎక్కువ అంటే నమ్మగలరా?.. కానీ నమ్మక తప్పదు. వీటిలో బంగారం మాత్రమే కాక వెండి, రాగి, ప్లాటినం, పల్లాడియం వంటి విలువైన లోహాలు ఉంటాయి. వీటిని సరిగా సేకరించే వీలు లేకపోవడం వల్ల ఏటా దాదాపు 4,35,000 టన్నుల మొబైల్ ఫోన్లను చెత్త కుప్పలో పడేస్తున్నాం. రీసైకిల్‌తో మంచి ఆదాయం.. ఇ-వ్యర్థాలు నుంచి విలువైన లోహాలను వేరు చేయడం ఇప్పటికే పెద్ద బిజినెస్‌గా మారింది. ప్రతి ఏడాది ఇ వేస్ట్‌ను రీసైకిల్ చేయడం ద్వారా 62.5 బిలియన్ల సంపద లభిస్తుంది. ఈ మొత్తం కొన్ని దేశాల జీడీపీకి సమానం. అయితే ఇ వ్యర్థాల నుంచి లోహాలను వేరు చేయడం అంత తెలికైన పనేం కాదు. ఇందుకు ఎంతో ఖర్చుతో పాటు శ్రమ కూడా అవసరం. ఎందుకంటే వీటిల్లో బంగారం, ప్లాటినం వంటి విలువైన లోహాలతో పాటు పాదరసం, లెడ్, కాడ్మియం వంటి హానికారక పదర్ధాలు కూడా ఉంటాయి. కాబట్టి రీసైకిలింగ్ అనేది సరైన పద్దతిలో.. సరైన సౌకర్యాల మధ్య జరగకపోతే.. పర్యావరణానికే కాక మనుషులకు కూడా హాని కల్గించే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కొన్ని యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు ఎటువంటి అనుమతుల్లేకుండా ఈ ఇ-వేస్ట్‌ను ఎగుమతి చేసుకుంటున్నాయి. అంతేకాక చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఈ వ్యర్థాలను రీసైకిల్ చేస్తున్నారు. కేవలం నైజిరియాలోనే దాదాపు లక్ష మంది ఈ ప్రమాదకర ఇ-వేస్ట్ రీసైకిలింగ్ యూనిట్లలో పని చేస్తున్నారు. అంటే వీరందరి బతకడం కోసం ప్రమాదంతో సావాసం చేస్తున్నారు. రీసైకిలింగ్లో భాగంగా చాలా పెద్ద మొత్తంలో ఇ-వ్యర్థాలను మండించడం వల్ల చాలా విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. ఫలితంగా పర్యావరణమే కాక అక్కడ ఉన్న కార్మికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివారణ మార్గాలు.. ఇ-వ్యర్థాల వల్ల పెరుగుతున్న కాలుష్యాన్ని, ఆరోగ్య సమస్యలను తగ్గించాలంటే ఒకటే మార్గం. సరైన రీతిలో వీటిని రీసైకిల్ చేయడం. ఇ-వేస్ట్‌ను తగ్గించాలంటే ముందుగా ప్రస్తుతం వాడుతున్న ఎలక్ట్రానిక్ పరికరాల తయారీని సమూలంగా మార్చాలి. త్వరగా పాడయ్యే పరికరాల కన్నా ఎక్కువ కాలం మన్నే వస్తువులను తయారు చేయ్యాలి. అంతేకాక ఒక్కసారి వాటి లైఫ్ టైమ్ పూర్తయ్యాక వాటిని సులువుగా, భద్రంగా రీసైకిల్ చేసే విధంగా డిజైన్ చేయాలి. తయారిదారుడు, అమ్మకందారుడు ఇద్దరు ఈ ఇ వ్యర్థాలను తగ్గించే బాధ్యతను తీసుకోవాలి. అందుకే బై బ్యాక్ స్కీమ్‌లను తీసుకురావాలి. అస్సెట్ - ఓనర్షిప్ వ్యవస్థ నుంచి సర్వీస్ - సబ్‌స్ర్కిప్షన్ వ్యవస్థకు మార్చాలి. అంతేకాక పరికరాలను ఒక నిర్దిష్ట కాలానికి లీజ్కిచ్చే విధానాలను తీసుకురావాలి. వీటినే మళ్లీ రీసైకిల్ చేసి తిరిగి వాడుకునేందుకు వీలుగా మార్చాలి. -
భారత్ ర్యాంక్ 40..దక్షిణ ఆసియాలో టాప్
న్యూఢిల్లీ : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యుఈఎఫ్) ర్యాంకింగ్‌లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంది. తాజా నివేదిక ప్రకారం దక్షిణ ఆసియాలో ఇండియా టాప్ ర్యాంక్ సాధించింది. గ్లోబల్ మోస్ట్ కాంపిటీటివ్నెస్ ర్యాంకింగ్‌లో 40వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో సింగపూర్ టాప్ ప్లేస్‌లో ప్రపంచంలో అత్యంత పోటీతత్వ ఆర్ధిక వ్యవస్థగా నిలవగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధించిందని నివేదించింది. అంతేకాదు చైనా, ఇండియా, ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థలు తమ హవాను కొనసాగిస్తాయని తెలిపింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఇచ్చిన ఈ ఏడాది గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్(జీసీఐ) రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భారత్ 40వ స్థానంలో నిలిచింది. పోటీతత్వ సూచికలో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 137 దేశాలు ఉండగా భారత్‌కు 40వ ర్యాంక్ దక్కింది. స్విట్జర్లాండ్, అమెరికా, సింగపూర్ దేశాలు టాప్ త్రీ ఆర్థిక దేశాలుగా కొనసాగుతున్నాయి. బ్రిక్స్ దేశాల్లో భారత్ మూడవ బెస్ట్ ఎకనామిక్ కంట్రీగా నిలిచింది. బ్రిక్స్ భాగస్వామ్య దేశాలైన .. చైనాకు 27వ స్థానం, రష్యాకు 38వ స్థానం వచ్చింది. భారత్‌లో మౌలిక సదుపాయాలు, ఉన్నత విద్య, లేబర్ మార్కెట్ పెరిగిందని రిపోర్ట్ తెలిపింది. విశ్వ పోటీ సూచీకలో బ్రెజిల్, టర్కీ దేశాలు క్రమంగా బలహీనపడ్డాయి. కానీ చైనా, ఇండియా, ఇండోనేషియా దేశాలు మాత్రం బలపడుతున్నట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ పేర్కొంది. గత ఏడాదితో పోలిస్తే భారత్ స్థానం ఒక పొజిషన్ తగ్గింది.12 అంశాల ఆధారంగా గ్లోబల్ కాంపిటీటివ్నెస్ ఇండెక్స్‌ను తయారు చేస్తారు -
‘డిజిటల్’తో లక్షల కోట్ల డాలర్ల ఆదా
• ఎన్నో సామాజిక ప్రయోజనాలు • వెల్లడించిన డబ్ల్యూఈఎఫ్ నివేదిక దావోస్: అన్ని రంగాలూ డిజిటల్‌కు మళ్లడం వల్ల లక్షల కోట్ల డాలర్లు ఆదా అవుతాయని, వినియోగదారులు లబ్ధి పొందుతారని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్)కు చెందిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనీషియేటివ్ (డీఐటీ) తెలిపింది. డిజిటైజేషన్ ఎన్నో విలువైన ప్రయోజనాలు కల్పిస్తుందని, ఇందుకు విధానపరమైన చర్యలు అవసరమని డీఐటీ పేర్కొంది. ‘‘డిజిటైజేషన్ వల్ల సగానికంటే ఎక్కువ విలువ సామాజిక ప్రయోజనాల రూపంలో కలుగుతుంది. ఉద్యోగాల కల్పన, ఆదాయ అసమతుల్యత తగ్గుతుంది. మెరుగైన ఆరోగ్య ఫలితాలు లభిస్తాయి. కార్బన్ ఉద్గారాలను, కాలహరణను, వినియోగదారుల వ్యయాలను తగ్గిస్తుంది’’ అని నివేదిక పేర్కొం ది. డిజిటల్ ప్రయోజనాలను ఒడిసి పట్టుకునేందుకు సమష్టి చర్యలు అవసరమని, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని డీటీఐ హెడ్ బ్రూస్ వెనెల్ట్ సూచించారు. ‘‘అన్ని రంగాల్లో డిజిటలీకరణ వల్ల లక్షలాది మందిని కాపాడుకోవచ్చు. అలాగే లక్షలాది డాలర్ల వ్యయాలు కూడా ఆదా అవుతాయి’’ అని నివేదిక వెల్లడించింది. నైపుణ్యాలను పెంచుకోవడం, వేగంగా మారుతున్న మార్కెట్ల అవసరాలను తీర్చేవిధంగా విద్యాపరమైన మార్పుల అవసరాన్ని కూడా ప్రస్తావించింది. ఆర్థిక వృద్ధికి, అసమానత్వాన్ని తగ్గించేందుకు, అందరికీ ప్రయోజనాల కల్పనను ప్రోత్సహించే సామర్థ్యాలు కొత్త టెక్నాలజీలకు ఉన్నాయని తెలిపింది. అయితే, ప్రపంచీకరణ తిరోగమనం, రాజకీయ ప్రజాకర్షణ విధానాలు, సామాజిక అస్థిరత్వంతో వీటికి ముప్పేనని హెచ్చరించింది.