భారత్‌లో ఈ ఏడాది 25 కోట్ల మొబైల్స్ అమ్మకాలు!
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్‌సెట్స్ మార్కెట్ గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 4 శాతం వృద్ధితో 25 కోట్ల యూనిట్లకు చేరుతుందని సైబర్ మీడియా రీసెర్చ్ సంస్థ తెలిపింది. రూ.5,000 ధరకు దిగువన ఉండే హ్యాండ్‌సెట్స్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. 2014తో పోలిస్తే గతేడాది స్మార్ట్‌ఫోన్ విభాగం 32 శాతం వార్షిక సగటు వృద్ధిరేటుతో 7.7 కోట్ల యూనిట్ల నుంచి 9.5 కోట్ల యూనిట్లకు పెరిగినట్లు తెలిపింది. ఈ ఏడాది 4జీ స్మార్ట్‌ఫోన్స్ విక్రయాలు 5 కోట్ల యూనిట్ల మార్క్‌ను దాటే అవకాశం ఉందని పేర్కొంది.
ఇక ఫీచర్ ఫోన్ మార్కెట్ విషయానికి వస్తే 2014లో 18 కోట్ల యూనిట్లుగా ఉన్న ఫీచర్ ఫోన్స్ విక్రయాలు గతేడాదిలో 17 శాతం క్షీణతతో 14.4 కోట్ల యూనిట్లకు తగ్గాయి. ఇదే పరిస్థితి ఈ ఏడాది కొనసాగే అవకాశం ఉంది. కంపెనీలు గతేడాది రూ. 10,000 ధర శ్రేణిలోని మొబైల్ హ్యాండ్‌సెట్స్‌కు ప్రాధాన్యమిచ్చాయని, కానీ ప్రస్తుతం రూ.5,000 ధరకు దిగువన ఉన్న మొబైల్ హ్యాండ్‌సెట్స్‌కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.