ముంబై: భారీ వృద్ధి ప్రణాళికల అమల్లో భాగంగా విమానయాన రంగ సంస్థ ఇండిగో తాజాగా ’ఎయిర్‌బస్ 320 నియో’ రకానికి చెందిన 300 విమానాలకు ఆర్డరు ఇచ్చింది. ఒక్కో విమానం రేటు వివరాలు వెల్లడించనప్పటికీ.. 2018లో ప్రచురించిన ధర ప్రకారం ఈ ఆర్డరు విలువ సుమారు 33 బిలియన్ డాలర్లుగా (దాదాపు రూ. 2.3 లక్షల కోట్లు) ఉండొచ్చని అంచనా. ఇంత పెద్ద సంఖ్యలో విమానాల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డరిచ్చిన ఏకైక సంస్థ తమదేనని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. తాజా కాంట్రాక్టుతో ఇండిగో మొత్తం 730 విమానాలకు(ఏ320 నియో) ఆర్డరిచ్చినట్లవుతుంది. ప్రస్తుతం 247 విమానాలతో ప్రతిరోజూ 1,500 ఫ్లయిట్స్ నడుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment