అదరగొట్టిన ఇన్ఫోసిస్ | Infosys net profits beats D-Street estimates | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన ఇన్ఫోసిస్

Published Fri, Apr 15 2016 10:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

అదరగొట్టిన ఇన్ఫోసిస్

అదరగొట్టిన ఇన్ఫోసిస్

న్యూఢిల్లీ : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వరుస లాభాలతో దూసుకెళ్తోంది. విశ్లేషకుల అంచనాలను అధిగమిస్తూ ఇన్ఫోసిస్ మెరుగైన ఫలితాను నమోదు చేసింది. నాలుగో త్రైమాసిక గణాంకాలను శుక్రవారం విడుదల చేసింది. గత త్రైమాసికం కంటే అధికంగా 3.9శాతం లాభాలను ఆర్జించిన ఇన్ఫోసిస్, ఈ నాలుగో త్రైమాసికంలో రూ.3597 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. చివరి త్రైమాసికంలో ఈ కంపెనీ నికర ఆదాయం రూ.3465 కోట్లగా ఉంది.


కంపెనీ సీఈవో గా విశాల్ సిక్కా పదవి బాధ్యతలు చేపట్టాక ఇన్ఫోసిస్ లాభాల బాట పట్టింది. బెంగళూరుకు చెందిన ఈ కంపెనీ వరుసగా నాలుగుసార్లు లాభాలనే నమోదు చేయడం విశేషం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు సెలవులను పాటిస్తుండటంతో, సోమవారం రోజు ప్రారంభమయ్యే ట్రేడింగ్ లో ఇన్ఫోసిస్ షేర్లు లాభాల బాట పట్టే అవకాశం ఉంటుందని నిపుణులంటున్నారు. దీని ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపై కూడా ఉండి, లాభాలను నమోదుచేస్తాయని అంచనావేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement