బెంగళూరు : దేశీయ ఐటిరంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఆదాయంలో అంచనాలను మించింది. మంగళవారం ప్రకటించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలను అదరగొట్టింది. గతంలో ఎప్పుడు లేనంతగా వృద్ధి రేటును నమోదు చేసింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో 4.9 శాతం వృద్ధి రేటుతో పాటు రూ. 3,030 కోట్ల నికరలాభం ఆర్జించగా, ఆదాయం రూ.14, 354 కోట్లకు పెరిగింది.
మరోవైపు ఈ ఏడాది వార్షిక అమ్మకాలు 10-12 శాతం పెరగవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అలాగే డాలర్లలో ఆ వృద్ధి రేటు 7.,2 నుంచి 9.2 శాతం పెరగవచ్చని భావిస్తున్నట్లు ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు తెలిపారు. ఇక ఇన్పోసిస్ ఆదాయం పెరగటంతో స్టాక్ మార్కెట్లలో ఆ సంస్థ షేర్లు 11 శాతంకి పైగా పెరిగాయి.
అంచనాలను మించిన ఇన్ఫీ
Published Tue, Jul 21 2015 11:04 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement
Advertisement