కొత్త దివాలా చట్టంతో అపరిమిత లాభాలు!
అసోచామ్, క్రిసిల్ అధ్యయనం
న్యూఢిల్లీ: కొత్త దివాలా చట్టం- 2016ను చిత్తశుద్ధితో అమలు చేస్తే అపరిమితమైన లాభాలున్నట్లు అసోచామ్, క్రిసిల్ అధ్యయనం ఒకటి తెలిపింది. దీనివల్ల ఎన్‌పీఏల రూపంలో ఉండిపోరుున మొత్తంలో రూ.25,000 కోట్లు బయటకు వస్తాయని సర్వే తెలిపింది. ఇలా ఒనగూరిన మొత్తాన్ని ఇతర ఉత్పాదక రంగాలకు రుణాలుగా ఇవ్వడం వల్ల మరింత ఆర్థిక పురోగతి చోటుచేసుకుంటుందని వివరించింది. బ్యాంకుకు రుణ చెల్లింపు వైఫల్యం వంటి తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉద్యోగులు, రుణ దాతలు, షేర్‌హోల్డర్లు ఎవ్వరైనా కంపెనీ ‘మూసివేత’ ప్రక్రియను ప్రారంభించడానికి తాజా చట్టం వీలు కల్పించనుంది.