విప్రో ఆస్తులను సీజ్ చేస్తాం: బీబీఎంపీ | IT firm Wipro faces asset seizure in Bangalore | Sakshi
Sakshi News home page

విప్రో ఆస్తులను సీజ్ చేస్తాం: బీబీఎంపీ

Published Fri, Nov 29 2013 1:33 PM | Last Updated on Sat, Sep 2 2017 1:06 AM

విప్రో ఆస్తులను సీజ్ చేస్తాం: బీబీఎంపీ

విప్రో ఆస్తులను సీజ్ చేస్తాం: బీబీఎంపీ

బెంగళూరు: దేశంలో మూడో పెద్ద ఐటీ కంపెనీగా పేరొందిన విప్రో సంస్థ భారీగా ఆస్తి పన్ను ఎగవేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. విప్రో తమకు బకాయిన పడిన రూ.16.47 కోట్లు ఆస్తి పన్ను వసూలు చేసేందుకు బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ న్యాయపోరాటానికి సిద్ధమవుతోంది.

ఆస్తి పన్ను కట్టాలని పలుమార్లు నోటీసులు పంపినా విప్రో స్పందించలేదని బృహత్ బెంగళూరు మహానగర సంస్థ(బీబీఎంపీ) ఆరోపించింది. చివరిసారిగా మూడోసారి నోటీసు పంపామని దీనికి స్పందించకుంటే న్యాయపరమైన చర్య తీసుకుంటామని బీబీఎంపీ పన్నులు, ఆర్థిక విభాగం చైర్మన్ ఎంఎస్ శివప్రసాద్ తెలిపారు. విప్రో చరాస్తులను సీజ్ చేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

బీబీఎంపీ తమను భయపెట్టాలని చూస్తోందని విప్రో ఆరోపించింది. బీబీఎంపీ కార్పొరేటర్లు, అధికారులు ఎటువంటి నోటీసు లేకుండా ఈ నెల 27న సార్జాపూర్లోని తమ క్యాంపస్లోకి ప్రవేశించి దౌర్జన్యం చేశారని తెలిపింది. బీబీఎంపీపై తాము కూడా న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement