టాటా మోటార్స్ చరిత్రలో తొలిసారి..
టాటా మోటార్స్ చరిత్రలో తొలిసారి..
Published Fri, Apr 7 2017 8:05 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
టాటా మోటార్స్ కు చెందిన జాగ్వార్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) విక్రయాల్లో దూసుకెళ్లింది. 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎన్నడూ లేనంతగా 6,04,009 యూనిట్లను విక్రయించింది. గతేడాది కంటే ఈ విక్రయాలు 16 శాతం ఎక్కువని కంపెనీ పేర్కొంది. ఆరు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించడం తమ కంపెనీ చరిత్రలోనే మొదటిసారని టాటా మోటార్స్ శుక్రవారం బీఎస్ఈ ఫైలింగ్ లో తెలిపింది. 2017 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలోనూ కంపెనీ రిటైల్ సేల్స్ 13 శాతం పెరిగి, 1,79,509 వెహికిల్స్ ను అమ్మినట్టు ప్రకటించింది.
2016 మార్చి కంటే ఈ ఏడాది మార్చిలో 21 శాతం విక్రయాలను పెంచుకుని 90,838 యూనిట్లను విక్రయించినట్టు తెలిపింది. అమ్మక వృద్ధి నమోదుచేయడం వరుసగా ఇది ఏడో సంవత్సరమని , ఈ ఏడాది ఆరు లక్షల మార్కును ఛేదించినట్టు జేఎల్ఆర్ గ్రూప్ సేల్స్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆండి గాస్ చెప్పారు. గత 12 నెలలుగా మూడు కొత్త ప్రొడక్ట్ లను లాంచ్ చేసినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఉత్పత్తులతో తాము ఈ వృద్ధిని నమోదుచేస్తున్నామని ఆనందం వ్యక్తంచేశారు.
Advertisement
Advertisement