‘జియో’ యూజర్లకు గుడ్‌న్యూస్‌! | Jio Cinema Tied Up With Sun Nxt For South Indian Jio Customers | Sakshi
Sakshi News home page

జియో సినిమా యూజర్లకు గుడ్‌న్యూస్‌!

Published Tue, Dec 3 2019 7:27 PM | Last Updated on Tue, Dec 3 2019 7:31 PM

Jio Cinema Tied Up With Sun Nxt For South Indian Jio Customers - Sakshi

ముంబై : టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో దక్షిణాది సినీ ప్రేమికులను అలరించేందుకు సిద్ధమైంది. జియో సినిమా.. సన్‌ టీవీ నెట్‌వర్క్‌ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన సన్‌ నెక్ట్స్‌ సహకారంతో దక్షిణ భారత సినిమాలను ప్రేక్షకులకు అందించనుంది.  సన్‌ నెక్ట్స్‌తో భాగస్వామ్యం కావడం ద్వారా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ సినిమాలను అత్యుత్తమ నాణ్యతతో యూజర్లకు అందించనుంది. తద్వారా జియో యూజర్లకు సన్‌ నెక్ట్స్‌ లైబ్రరీ నుంచి 4 వేల సినిమాలు చూసే అవకాశం లభిస్తుంది. 

కాగా జియో సినిమా యాప్‌లో ఇప్పటికే 10 వేలకు పైగా సినిమాలు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా లక్షకు పైగా టీవీ షో ఎపిసోడ్ల కంటెంట్‌ను కలిగి ఉంది. ఇక ప్రస్తుతం సన్‌ నెక్ట్స్‌ మూవీ కేటలాగ్‌తో అపరిమిత సినిమాలు చూసే వీలును దక్షిణాది ప్రేక్షకులకు కల్పించింది. కాగా దక్షిణ భారత స్టూడియోల నుంచి అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు సన్‌ నెక్ట్స్ పేరు గాంచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement