సరికొత్తగా జేఎల్‌ఆర్‌ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్ | JLR launches XE, XF sedans in India with new petrol engine | Sakshi
Sakshi News home page

సరికొత్తగా జేఎల్‌ఆర్‌ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్

Published Fri, Mar 16 2018 12:12 AM | Last Updated on Sat, Mar 17 2018 9:47 AM

JLR launches XE, XF sedans in India with new petrol engine - Sakshi

న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌రోవర్‌ (జేఎల్‌ఆర్‌) తాజాగా సరికొత్త అల్యూమినియం ఇంజినియం 2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్లతో కూడిన ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌ సెడాన్‌ కార్లను భారత మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. జాగ్వార్‌ ఎక్స్‌ఈ ప్రారంభ ధర రూ.35.99 లక్షలుగా ఉంది. ఇక జాగ్వార్‌ ఎక్స్‌ఎఫ్‌ ధర రూ.49.80 లక్షల నుంచి ప్రారంభమౌతోంది.

‘జాగ్వార్‌ ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌లకు భారత్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఇప్పుడు ఈ సెడాన్‌లను సరికొత్త, అధిక సామర్థ్యం కలిగిన ఇంజినియం పెట్రోల్‌ ఇంజిన్లతో అప్‌గ్రేడ్‌ చేశాం. దీంతో ఈ రెండు కార్లు మరింత మంది కస్టమర్లకు చేరువవుతాయని భావిస్తున్నాం’ అని జేఎల్‌ఆర్‌ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోహిత్‌ సూరి తెలిపారు. ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎఫ్‌లలో 8 స్పీడ్‌ ఎలక్ట్రానిక్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్స్‌ను అమర్చామని పేర్కొంది.       

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement