గతవారం బిజినెస్ | Lastweek Bussiness | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Feb 15 2016 3:05 AM | Last Updated on Sun, Sep 3 2017 5:39 PM

Lastweek Bussiness

జీడీపీ వృద్ధి జోరు
భారత స్థూల దేశీయోత్పత్తి  (జీడీపీ) వృద్ధి అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అంచనాలను మించి 7.3 శాతంగా నమోదయింది. ఇంతక్రితం రెండు త్రైమాసికాల గణాంకాలను కూడా ఎగువముఖంగా సవరిస్తూ... కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌వో) తాజా లెక్కలను విడుదల చేసింది. దీని ప్రకారం ఏప్రిల్-జూన్ త్రైమాసిక వృద్ధిరేటు 7 శాతం నుంచి 7.6 శాతానికి చేరింది. జూలై- సెప్టెంబరు త్రైమాసిక వృద్ధి రేటు గణాంకాలను కూడా 7.4 నుంచి 7.7 శాతానికి పెంచారు.
 
ప్రభుత్వ బ్యాంకులకు ఎన్‌పీఏల గుదిబండ
ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) 2012-15 మధ్య కాలంలో రూ. 1.14 లక్షల కోట్ల మొండి బకాయిలను (ఎన్‌పీఏ) ఖాతాల నుంచి తొలగించాయి. 2015 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలోనే ఇందులో సగభాగం .. సుమారు రూ. 52,542 కోట్లను తొలగించాయి. 27 ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఈ గణాంకాలు విడుదల చేసింది. 2014-15లో రూ. 21,313 కోట్లను తొలగించిన ఎస్‌బీఐ అత్యధికంగా రైటాఫ్ చేసిన పీఎస్‌బీల్లో తొలి స్థానంలో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ. 6,587 కోట్లు), ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్ (రూ.3,131 కోట్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
   
ఫార్మా రంగంలో ఉపాధి వెల్లువ!
ఫార్మాస్యూటికల్ అండ్ హెల్త్‌కేర్ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఈ రంగ ఉద్యోగ నియామకాల్లో ప్రస్తుత సంవత్సరం 20 శాతంపైగా వృద్ధి నమోదవుతుందని, దాదాపు 1.34 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పీపుల్స్‌స్ట్రాంగ్, వీబాక్స్‌లు సంయుక్తంగా రూపొందించిన ‘ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2016’ తెలియజేసింది.
   
తిరుపతిలో తొలి ఐటీ కంపెనీ కమ్యుని క్లిక్
తిరుపతిలో తొలి ఐటీ కంపెనీ ఏర్పాటయింది. అమెరికాకు చెందిన కమ్యుని క్లిక్ ఐటీ కంపెనీ... తన భారతీయ అనుబంధ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసింది. మెరుగైన, నాణ్యమైన వీడియో కాలింగ్‌ను అభివృద్ధి చేయడం, వీడియో కాలింగ్‌కు అనుబంధంగా యాప్స్‌ను రూపొందించటం ఈ విభాగం చేస్తుందని కమ్యుని క్లిక్ పేర్కొంది.
    
పిచాయ్‌కి గూగుల్ బహుమతి
గూగుల్ సెర్చింజన్ సహా పలు కీలక విభాగాలకు సీఈఓగా వ్యవహరిస్తున్న సుందర్ పిచాయ్‌కి కంపెనీ 199 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను కేటాయించింది. అమెరికా చరిత్రలో ఒక లిస్టెడ్ కంపెనీ తన ఉద్యోగికి ఈ స్థాయిలో షేర్లు కేటాయించటం ఇదే తొలిసారి.
   
పసిడి దిగుమతుల టారిఫ్ విలువ పెంపు
అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా గురువారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎకై ్సజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) పసిడి దిగుమతులపై టారిఫ్ విలువను పెంచింది. ఈ ధర 10 గ్రాములకు 363 డాలర్ల నుంచి 388 డాలర్లకు పెరిగింది. వెండి విషయంలో ఈ ధర 443 డాలర్ల నుంచి 487 డాలర్లకు ఎగసింది. ఎటువంటి అవకతవకలకూ (అండర్ ఇన్‌వాయిసింగ్) వీలులేకుండా పసిడి దిగుమతులపై కస్టమ్స్ సుంకం విధించడానికి దిగుమతి టారిఫ్ విలువ ప్రాతిపదికగా ఉంటుంది.
 
రెండో నెలా తగ్గిన పారిశ్రామికోత్పత్తి
పారిశ్రామికోత్పత్తి వృద్ధి వరుసగా రెండో నెలా మందగించి మైనస్‌లోనే కొనసాగింది. దీనికి సంబంధించిన సూచీ (ఐఐపీ) డిసెంబర్‌లో అసలు వృద్ధి కనపర్చకపోగా.. 1.3 శాతం క్షీణిం చింది. ప్రధానంగా తయారీ, యంత్రపరికరాల రంగాల పనితీరు నిరాశాజనకంగా ఉండటం ఇందుకు కారణమైంది. నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పాదకత మైనస్ 3.4 శాతంగా ఉంది.
 
కంపెనీలకు ‘వ్యాపార గుర్తింపు సంఖ్య’

కేంద్ర ప్రభుత్వం దేశంలో వ్యాపారానుకూల పరిస్థితుల కల్పనే లక్ష్యంగా త్వరలో కంపెనీలకు ‘వ్యాపార గుర్తింపు సంఖ్య’ (బిజి నెస్ ఐడెంటిఫికేషన్ నంబర్-బీఐఎన్)ను అమల్లోకి తీసుకురానున్నది. ఒక కంపెనీ వేర్వేరు కార్యకలాపాలకు సంబంధించి పలు రకాల రిజిస్ట్రేషన్ నంబర్లను పొందే ప్రక్రియను తొలగించడం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. సాధారణంగా ఒక కంపెనీ 18 రకాల రిజిస్ట్రేషన్ నంబర్లను పొందాల్సి ఉంటుంది.
 
భారత్‌లో వ్యాపారం కష్టం
ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం వ్యాపారానుకూల దేశాల జా బితా-2016లో భారత్ 130వ స్థానంలో (189 దేశాలకుగానూ) ఉంది. గతేడాదితో పోలిస్తే భారత్ 4 స్థానాలను మెరుగుపరచుకుంది. ప్రభుత్వం టాప్-50లో స్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.
 
కింగ్‌ఫిషర్ హౌస్ వేలం!
ప్రభుత్వ దిగ్గజ బ్యాంక్ ఎస్‌బీఐ.. బకాయిల వసూలు నిమిత్తం ముంబై దేశీ విమానాశ్రయం సమీపంలో ఉన్న కింగ్‌ఫిషర్ హౌస్‌ను మార్చి 17న ఈ-వేలం వేయనుంది. దీన్ని ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ నిర్వహిస్తుంది. ఈ ప్రాపర్టీ ధరను ట్రస్టీ కంపెనీ రూ. 150 కోట్లుగా నిర్దేశించింది.  
 
ఆరో నెలా ధరలు రయ్
వరుసగా ఆరో నెలా ధరల పెరుగుదల కొనసాగింది. ఆహారోత్పత్తుల రేట్లు ఎగియడంతో జనవరిలో ద్రవ్యోల్బణం 5.69 శాతంగా నమోదైంది. ఇది 16 నెలల గరిష్ట స్థాయి.  2014 సెప్టెంబర్‌లో ద్రవ్యోల్బణ రేటు 6.46 శాతంగా నమోదైంది.
 
బీఎస్‌ఈ ‘ఆన్‌లైన్ ఎడ్యుకేషన్’
‘బాంబే స్టాక్ ఎక్చ్సేంజ్’ అనుబంధ సంస్థ ‘బీఎస్‌ఈ ఇన్‌స్టిట్యూట్’ తాజాగ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈవర్సిటీ.కామ్’ అనే ఆన్‌లైన్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఫైనాన్షియల్ మార్కెట్స్ విభాగంలో ఎడ్యుకేషన్‌ను ప్రోత్సహించడమే ఈ ప్లాట్‌ఫామ్ ఉద్దేశం. ఇది ఫైనాన్స్ సంబంధిత కోర్సులను అందిస్తుంది.
 
డీల్స్..

* స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడు ల పరంపరను కొనసాగిస్తూ.. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తాజాగా మరో సంస్థ మోగ్లిక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు.
* దేశీయంగా మూడో అతిపెద్ద ఐటీ సంస్థ విప్రో తాజాగా అ మెరికాకు చెందిన హెల్త్‌ప్లాన్ సర్వీసెస్ సంస్థను కొనుగోలు చే యనున్నట్లు తెలిపింది. ఈ డీల్ విలువ 460 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 3,150 కోట్లు)గా ఉంటుందని తెలియజేసింది.
* టాటా గ్రూప్‌కు చెందిన ట్రెంట్  పబ్లిషింగ్ విభాగం వెస్ట్‌లాండ్‌లో 26 శాతం వాటాను ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్ రూ.9.5 కోట్లకు కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement