రుణ మొత్తంలో వసూలు 2 శాతమే!
మాల్యాపై రాజ్యసభలో మంత్రి గంగ్వార్
న్యూఢిల్లీ: ఉద్దేశపూర్వక ఎగవేతదారు, పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా 2016 డిసెంబర్ 31వ తేదీ నాటికి దాదాపు రూ.8,191 కోట్లు బకాయి ఉండగా, బ్యాంకింగ్ కేవలం అందులో 2 శాతం అంటే రూ.155 కోట్లు మాత్రమే వసూలు చేసుకోగలిగిందని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖిత పూర్వక సమాధానంలో తెలిపారు. జప్తులో ఉన్న కొన్ని ఆస్తుల ఆన్‌లైన్ మోగా వేలం ద్వారా ఈ మొత్తాలను బ్యాంకులు వసూలు చేసుకోగలిగినట్లు గంగ్వార్ తెలిపారు. మిగిలిన మొత్తాల వసూళ్లకు బ్యాంకులు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలిపారు.