హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాదీ కంపెనీ గోల్డ్‌స్టోన్ ఇన్‌ఫ్రాటెక్ తాజాగా ఈ–బజ్ కే6 మోడల్‌ను తయారు చేసింది. కేంద్ర మంత్రి అనంత్ గీతే చేతుల మీదుగా మంగళవారం ఆవిష్కరించిన ఈ బస్‌లను.. నేపాల్‌కు ఎగుమతి చేస్తున్నట్లు గోల్డ్‌స్టోన్ ఈడీ నాగ సత్యం చెప్పారు. 7 మీటర్ల పొడవున్న ఈబజ్ కే6 బస్‌లో 18 మంది కూర్చునే వీలుంది.
ఒకసారి బ్యాటరీ చార్జ్ చేస్తే గరిష్ఠంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో 200 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. మూడు నాలుగు గంటల్లో చార్జింగ్ పూర్తి అవుతుంది. చైనాకు చెందిన బీవైడీ భాగస్వామ్యంతో గోల్డ్‌స్టోన్ ఈ బస్‌లను తయారు చేస్తోంది.
భారత్‌లో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ
ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీల కోసం చైనాపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా త్వరలో భారత్ కూడా తయారు చేయగలదని కేంద్ర మంత్రి అనంత్ గీతే తెలిపారు. ఈ దిశగా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని ఆయన వివరించారు.
దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల విస్తృత వినియోగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో అనంత్ గీతే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం చైనా నుంచి లిథియం అయాన్ బ్యాటరీలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని, బస్సుల్లో ఉపయోగించే వాటి కోసం ఒక్కో దానికి రూ. 50–60 లక్షలు అవుతోందని మంత్రి చెప్పారు. బ్యాటరీల ఖర్చు తగ్గితే, ఎలక్ట్రిక్ వాహనాల ధరలు కూడా అందుబాటు స్థాయిలోకి వస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment