సాక్షి, ముంబై: ప్రపంచ ఈ కామర్స్‌దిగ్గజం వాల్‌మార్ట్ , దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మెగా డీల్ నేపథ్యంలో ఉద్యోగులు భారీగా లాభపడనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా వెచ్చించి 77 శాతం వాటాను వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన సంగతి విదితమే. ఈ డీల్‌లో భాగంగా స్టాక్ బై బ్యాక్ ఆప్షన్ కింద ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులకు జాక్ పాట్ తగిలినట్టయింది. దీంతొ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారిపోనున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ డీల్ పిలుస్తున్న ఈ కొనుగోలు ఒప్పందం ద్వారా ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ప్రస్తుత, మాజీ ఉద్యోగుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేయడం కోసం 50 కోట్ల డాలర్లు (సుమారు రూ.3300 కోట్లు) కేటాయించింది. ఈ డీల్ పూర్తవగానే ఈఎస్‌ఓపీ (ఎంప్లాయీ స్టాక్ ఓనర్‌షిప్ ప్లాన్) ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత, మాజీ ఉద్యోగులు లాభాపడనున్నారు. తాజా ఒప్పందంతో సీనియర్ సభ్యుల కొందరు కోటీశ్వరులు కాబోతున్నారని మార్కెటింగ్ టీంలోని సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా రాలేదనీ, బహుశా శుక్రవారం ఒక ప్రకటన వచ్చే అవకాశ ఉందని భావించారు. ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగులు మూడేళ్ల వ్యవధిలో తమ షేర్లను నగదు రూపంలోకి మార్చుకోవచ్చని ఆయన వెల్లడించారు. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 200-250మంది, మింత్రాకు చెందిన 150మందికి, జబాంగ్‌లోని మరో 50 మంది ఉద్యోగులకు ఈ ప్రయోజనాలు చేకూరనున్నట్టు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ కో ఫౌండర్ గ్రూప్ సీఈవో బిన్ని బన్సాల్ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్లను 100శాతం బై బేక్ చేస్తామని బుధవారం జరిగిన ఒక సమావేశంలో వెల్లడించారు. షేర్ ధర సుమారు 10వేల రూపాయల వద్ద ఈ కొనుగోలు ఉండవచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment