అమెరికన్‌ సంస్థతో జొమాటో ఒప్పందం.. | Marriott International Agreement With Zomato | Sakshi
Sakshi News home page

అమెరికన్‌ సంస్థతో జొమాటో ఒప్పందం

Jun 12 2020 5:35 PM | Updated on Jun 12 2020 5:38 PM

Marriott International Agreement With Zomato - Sakshi

ముంబై: ప్రముఖ ఫుడ్‌  డెలివరీ సంస్థ జొమాటో మరో దిగ్గజ సంస్థతో జత కట్టనుంది. అమెరికాకు చెందిన మారియేట్‌ ఇంటర్నేషనల్ (అత్యాధునిక రిస్టారెంట్)‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్‌లో తమ సంస్థను మరింత విస్తరించేందుకు జొమాటోతో పనిచేయనున్నట్లు మారియేట్‌ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ‘మారియేట్‌ ఆన్‌ వీల్స్’ పేరుతో క్యాటరింగ్‌ సేవలు, మీల్స్ అందిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్లకు వేగంగా పుడ్ ‌డెలివరీ సేవలందించడమే తమ లక్క్ష్యమని ఇరు సంస్థలు పేర్కొన్నాయి.

జొమాటో సంస్థతో ఒప్పందం ద్వారా కస్టమర్లకు మరింత వేగంగా సేవలను అందిస్తామని మారియేట్‌ దక్షిణాసియా వైస్‌ ప్రెసిడెంట్‌ నీరజ్‌ గోవిల్‌ పేర్కొన్నారు. మారియేట్ సంస్థతో కలిసే పనిచేయడం ద్వారా సంస్థ మరింత వృద్ధిని సాధిస్తుందని జొమాటో పేర్కొంది. కాగా కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇరు సంస్థలు శానిటైజేషన్‌కు(శుభ్రత) అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు.  వినియోగదారులను ఆకట్టుకునేందుకు జొమాటో సంస్థ అనేక వ్యూహాలు రచిస్తుంది. ఇటీవల డ్రోన్ల ద్వారా ఫుడ్‌ డెలివరీ చేస్తున్నట్లు జొమాటో ప్రకటించిన విషయం తెలిసిందే. (చదవండి: స్విగ్గీ, జొమాటో డ్రోన్‌ డెలివరీ..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement