
ప్రయాణికుల వాహనాల్లో ‘మారుతీ’నే టాప్
న్యూఢిల్లీ: ప్రయాణికుల వాహనాల్లో మారుతీ సుజుకి తన అగ్ర స్థానాన్ని కొనసాగిస్తోంది. జూలై నెలకు సంబంధించి అధికంగా అమ్ముడు పోయిన మొదటి పది ప్యాసింజర్ కార్లలో ఏడు మోడల్స్ మారుతీవే ఉన్నాయి. భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(సియామ్) గణాంకాల ప్రకారం... జూలైలో విక్రయాల పరంగా మారుతి ఆల్టో మొదటి స్థానంలో నిలిచింది. 19,844 కార్లు అమ్ముడుపోయాయి. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 11,961 యూనిట్లతో ఐదో స్థానం దక్కించుకుంది. విటారా బ్రెజా 10,232 యూనిట్లతో ఆరో స్థానంలో ఉంది.