మారుతి కూడా : బై నౌ.. పే లేటర్‌ | Maruti Suzuki Buy Now PayLater Offer | Sakshi
Sakshi News home page

మారుతి కూడా : బై నౌ.. పే లేటర్‌

Published Fri, May 22 2020 5:35 PM | Last Updated on Fri, May 22 2020 5:52 PM

Maruti Suzuki Buy Now PayLater Offer - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సంక్షోభ సమయంలో దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ  మారుతి సుజుకి  కూడా తన వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఎం అండ్‌ ఎం తరహాలో 'బై నౌ- పే లేటర్ ఆఫర్' ని తీసుకొచ్చింది. కరోనా  సంక్షోభంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కార్‌ను సులభంగా కొనుగోలుకు సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకొచ్చామని మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్‌ఐ) ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు గాను చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నట్టు వెల్లడించింది. (అమెజాన్‌లో 50 వేల ఉద్యోగాలు)

కోవిడ్ -19, లాక్‌డౌన్ సమయంలో లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్న కొనుగోలుదారులే లక్ష్యంగా తీసుకొచ్చామని ఎంఎస్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్‌ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. వెంటనే అదనపు ఒత్తిడిలేకుండా వినియోగదారులను కారు కొనుగోలు వైపు ప్రోత్సహిస్తుందన్నారు. వినియోగదారులకు ప్రయోజనాలను చేకూర్చే లక్ష్యంతోనే ఈ భాగస్వామ్యమని చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ అండ్‌ ఫైనాన్స్ కో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవీంద్ర కుండు చెప్పారు. (చైనాలో 160 శాతం పెరిగిన ఆపిల్‌ అమ్మకాలు)

బై నౌ, పే లేటర్‌ పేరిట ఆ ఆఫర్‌ను మారుతీ సుజుకీ ప్రవేశపెట్టిన ఈ పథకంలో వినియోగదారులు కారును కొన్న 2 నెలల తరువాతే ఈఎంఐ కట్టడం ప్రారంభించవచ్చు. దేశవ్యాప్తంగా 1964 నగరాలు, పట్టణాల్లో ఉన్న 3086 మారుతి సుజుకి ఔట్‌లెట్లలో ఈ ఆఫర్‌ అందుబాటులో ఉందని మారుతి తెలిపింది. కేవలం ఎంపిక చేసిన మారుతి సుజుకి కారు మోడల్స్‌పైనే ఈ ఆఫర్‌ అందుబాటులో వుంటుంది. జూన్‌ 30వ తేదీతో ఈ ఆఫర్‌కు గడువు ముగియనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement