పానిక్ బటన్ ఏర్పాటుకు గడువు పొడిగింపు
న్యూఢిల్లీ: కొత్త మొబైల్ ఫోన్లలో పానిక్ బటన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మరో రెండు నెలలు గడువునిచ్చింది. తమ వద్ద విక్రయం కాని పానిక్ బటన్ ఫీచర్‌లేని ఫోన్లు చాలా ఉన్నాయనే మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీల విజ్ఞప్తి మేరకు కొత్త హ్యాండ్‌సెట్స్‌లో పానిక్ బటన్ ఏర్పాటుకు ఇది వరకు ఇచ్చిన గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగిస్తున్నామని టెలికం కార్యదర్శి జె.ఎస్.దీపర్ తెలిపారు. 2017 జనవరి 1 నుంచి దేశంలో విక్రయించే అన్ని మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లోనూ పానిక్ బటన్ తప్పనిసరిగా ఉండాలని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లోనే నిర్ణయం తీసుకుంది.