
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి.
హెచ్‌ఎంఏ ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (హెచ్‌ఎంఏ) నూతన ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.