![కేవైసీ వ్యవస్థ మరింత పటిష్టం కావాలి...](/styles/webp/s3/article_images/2017/09/4/71468006689_625x300.jpg.webp?itok=7gax9SZ7)
కేవైసీ వ్యవస్థ మరింత పటిష్టం కావాలి...
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఖాతాదారుల వివరాల వెల్లడికి సంబంధించి ప్రస్తుతం అమలవుతున్న కేవైసీ నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉందని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి అభిప్రాయపడ్డారు. కేవైసీ ఫారంల రూపంలో వచ్చే ఖాతాదారుల వివరాల వాస్తవికతను ధృవీకరించుకునేలా తగు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని బ్యాంకులకు సూచించారు. ఖాతాదారులు ఇచ్చిన డాక్యుమెంట్‌లను బ్యాంకులు ప్రస్తుతం ఆన్‌లైన్ మాధ్యమంలో ధృవీకరించుకునే వెసులుబాటు లేనందున పాన్ కార్డులు.. డ్రైవింగ్ లెసైన్సులు వంటి పత్రాల మార్ఫింగ్ తదితర మోసాలకు అవకాశాలు ఉన్నాయని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో వివిధ డేటాబేస్‌లను అనుసంధానం చేయడం ద్వారా ఇలాంటి మోసాలను అరికట్టడం సాధ్యపడుతుందని శుక్రవారం ఇక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు.