నల్లధనం వెల్లడి పథకం అవినీతి సొమ్ముకు వర్తించదు
న్యూఢిల్లీ: అవినీతి ద్వారా డబ్బు సంపాదించిన వాళ్లు.. దేశీయ నల్లధనం వెల్లడి పథకానికి అనర్హులని ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టంచేసింది. ఇందులో కేవలం గతంలో తమ ఆదాయంపై పన్ను చెల్లించని వారు.. ఆ ఆదాయాన్ని వెల్లడించి పన్నులు, జరిమానా, సర్‌చార్జ్ అంతా కలిపి 45% చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. దీనికి సంబంధించి పలు సందేహాలు, ప్రశ్నలకు సమాధానాలతో పాటు ఒక సర్క్యులర్‌ను ఆర్థికశాఖ విడుదల చేసింది. ఈ పథకం కింద ఆదాయాన్ని వెల్లడించే వ్యక్తులపై ఆదాయ పన్ను శాఖ ఎలాంటి చర్యలు తీసుకోదని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం కింద శిక్షార్హమైన ఏ నేరాలకు ఈ పథకం వర్తించబోదని పేర్కొంది.