
7.7 శాతానికి జీడీపీ వృద్ధి : నోమురా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఆశించిన మేర ఎగుమతులు ఉండవని, ఈ నేపథ్యంలో జీడీ పీ వృద్ధి రేటు 7.7%కి పరిమితమవుతుందని నోమురా పేర్కొంది. ఇంతకుముందు జీడీపీ వృద్ధి 7.8 %గా అంచనా వేసింది. గత ఆర్థిక ఏడాది చివరి త్రైమాసికంలో జీడీపీ రేటు 7.9%కి పెరగగా, మొత్తంగా 7.6 శాతం ఉన్నట్లు పేర్కొంది. ఏడవ వేతన సవరణ పెంపు, సాధారణ వర్షపాతం, ప్రభుత్వ మిగులు నిధులు వంటి అంశాలు వృద్ధి రేటు పెరగటానికి దోహదం చేస్తాయని నోమురా వెల్లడించింది. 2016 చివరి వర కూ ఆర్‌బీఐ పరపతి విధానంలో మార్పులు ఉండకపోవచ్చునని నివేదికలో తెలిపింది. ఏప్రిల్‌లో రెపో రేటును 0.25% తగ్గించింది. ఆరు నెలల్లో తగ్గించటం ఇదే తొలిసారి.