ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె.శర్మ | Non-executive chairman of ICICI Bank m.k.sharma | Sakshi
Sakshi News home page

ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె.శర్మ

Jun 10 2015 12:32 AM | Updated on Sep 3 2017 3:28 AM

ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె.శర్మ

ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె.శర్మ

కె.వి. కామత్ స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె. శర్మ నియమితులయ్యారు.

న్యూఢిల్లీ: కె.వి. కామత్ స్థానంలో ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎం.కె. శర్మ నియమితులయ్యారు. ఆయన గతంలో హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా జూలై 1 నుంచి పదవీ బాధ్యతలు చేపట్టనున్న ఆయన, సంస్థకు తన సేవలను ఐదేళ్లపాటు అందించనున్నారు. ఆయన కార్పొరేట్ గవర్నెన్స్‌కు సంబంధించిన పలు కమిటీలలో సభ్యులుగా ఉన్నారు. అలాగే ప్రస్తుతం ఐసీఐసీఐ లంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో ఇండిపెండెంట్ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement