ఎన్‌ఎస్‌ఈ నుంచి డీసీ హోల్డింగ్స్ డీలిస్టింగ్
న్యూఢిల్లీ: ఎన్‌ఎస్‌ఈ 19 కంపెనీలను తన ప్లాట్ ఫామ్ నుంచి వచ్చే నెలలో డీలిస్ట్ చేయనుంది. ఇలా తప్పనిసరిగా డీలిస్ట్ అయ్యే వాటిలో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్, కౌటన్స్ రిటైల్ ఇండియా లిమిటెడ్ తదితర కంపెనీలు ఉన్నాయి. సెబీ నిబంధనలను అనుసరించి వచ్చే నెల 12న 19 కంపెనీలను డీలిస్ట్ చేస్తున్నట్టు ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది.
ఈ జాబితాలో కోరల్ హబ్, ఎవినిక్స్ యాసెసరీస్ (ఎవినిక్స్ ఇండస్ట్రీస్), నూకెమ్ లిమిటెడ్, స్పాంకో లిమిటెడ్, పరేఖ్ ప్లాటినమ్, పసుపతి ఫ్యాబ్రిక్స్, పెర్ల్ ఇంజనీరింగ్ పాలీమర్స్, పోలార్ ఇండస్ట్రీస్, వికాష్ మెటల్ అండ్ పవర్, తక్షీల్ సొల్యూషన్స్, అంకుర్ డ్రగ్స్ అండ్ ఫార్మా, యాష్కో న్యూలబ్ ఇండస్ట్రీస్, క్రూ బీఓఎస్ ప్రొడక్ట్స్, ధనుష్ టెక్నాలజీస్, టెలీడేటా టెక్నాలజీ సొల్యూషన్స్, టెలీడేటా మెరైన్ సొల్యూషన్స్, ఐవోఎల్ నెట్‌కామ్ ఉన్నాయి. గతేడాది ఆగస్ట్ నుంచి ఈ ఏడాది మార్చి మధ్య కాలంలోనూ ఎన్‌ఎస్‌ఈ 70 కంపెనీలను ఇలా డీలిస్ట్ చేసింది.