ఓలా ట్విట్టర్ హ్యాకయింది!
దేశవ్యాప్తంగా టాక్సీ సర్వీసులు అందిస్తున్న ఓలా క్యాబ్స్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకయింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆ అకౌంటును హ్యాక్ చేసి, తమ చేతికి వచ్చిన సందేశాలను అందులో పెడుతున్నారు. అయితే అసలు తమ అకౌంట్ హ్యాక్ అయిన విషయాన్ని ఇంకా ఓలా కూడా గుర్తించినట్లు లేదు.
అలాగే, అందులో పోస్టింగులు చేస్తున్నవాళ్లు కూడా తాము హ్యాక్ చేశామని ప్రకటించుకోలేదు గానీ, అసలు సంబంధం లేని ట్వీట్లు పెడుతున్నారు. 'మీరు తాగడానికి వెళ్తుంటే నన్ను కూడా పిలవండి'.. ఇలాంటి ఫన్నీ ట్వీట్లు అందులో కనిపిస్తున్నాయి. ఇక హ్యాక్ చేసినవారు కూడా తాము ఎందుకు చేశామో, తమ లక్ష్యం ఏంటో చెప్పలేదు.