కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు | Ola to lay off nearly 25percent of its total workforce | Sakshi
Sakshi News home page

కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు

Published Wed, May 20 2020 2:05 PM | Last Updated on Tue, May 26 2020 11:12 AM

Ola to lay off nearly 25percent of its total workforce - Sakshi

సాక్షి, ముంబై :  ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఓలా కూడా ఉద్యోగులను తొలగింపునకు నిర్ణయించింది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా గత రెండు నెలల్లో ఆదాయం 95 శాతం క్షీణించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఓలా రైడ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫుడ్ బిజినెస్ నుండి 1,400 మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు  ప్రకటించింది. ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో ఓలా సీఈఓ భవీష్ అగర్వాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. (మరో 3000 మంది ఉబర్‌ ఉద్యోగులపై వేటు)

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభం కారణంగా  భారతదేశం అంతటా మిలియన్ల మంది తమ డ్రైవర్లు, వారి కుటుంబాల జీవనోపాధిని ప్రభావితం చేసిందని సీఈవో చెప్పారు.  అసాధారణమైన, అనిశ్చితమైన ఈ పరిస్థితుల ప్రభావం తమపై దీర్ఘకాలంగా ఉండనుందని ఆయన ప్రకటించారు. కాగా దేశంలో  కోవిడ్‌-19 కట్టడిగాను విధించిన లాక్‌డౌన్‌తో  దేశ వ్యాప్తంగా  ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. మార్చి 22నుంచి అన్ని రవాణా  వ్యవస్థలు స్థంభించిపోయాయి.  దీంతో క్యాబ్‌ సేవల సంస్థలు ఓలా, ఉబెర్‌ సేవలు కూడా  ఎక్కడివక్కడే ఆగిపోయాయి. దీంతో ఆదాయాలు  పడిపోయాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉబెర్‌   కూడా ఉ‍ద్యోగుల  తొలగింపు నిర్ణయాన్ని  ప్రకటించిన సంగతి తెలిసిందే.

చదవండి: రెడ్‌మి ఎక్స్‌ సిరీస్‌ స్మార్ట్‌టీవీలు త్వరలో

కరోనా: వారికి ఎం అండ్‌ ఎం బంపర్‌ ఆఫర్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement