మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో ఓలా ఒప్పందం | Ola Partners With Mahindra First Choice Services | Sakshi
Sakshi News home page

మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో ఓలా ఒప్పందం

Published Sat, Oct 10 2015 1:08 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో ఓలా ఒప్పందం

మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో ఓలా ఒప్పందం

హైదరాబాద్: వ్యక్తిగత రవాణాకు సంబంధించిన మొబైల్ యాప్ ఓలా, మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా ఫస్ట్ చాయిస్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఓలా బ్యాడ్జ్ కింద కార్లను నిర్వహించే డ్రైవర్లకు కారు సర్వీసింగ్ సేవలపై మహీంద్రా ఫస్ట్ చాయిస్ 50 శాతం వరకూ రాయితీ ఇస్తుందని ఓలా ఒక ప్రకటనలో తెలిపింది. మహీంద్రా ఫస్ట్ చాయిస్ సంస్థ కార్ల సర్వీసింగ్‌కు సంబంధించి ఓలా డ్రైవర్లకు రెండు రకాల ప్యాకేజీలను ఆఫర్ చేస్తోందని  ఓలా సీఓఓ ప్రణయ్ జివ్‌రాజ్‌కా పేర్కొన్నారు.

మహీంద్రా ఫస్ట్ చాయిస్ సర్వీసెస్ వర్క్ షాపుల్లో కారు సర్వీసింగ్ చేయించుకున్నవారికి కార్ ఫ్రెషనర్స్, డాష్‌బోర్డ్ మెమెంటోల వంటివి ఉచితంగా కూడా లభిస్తాయని వివరించారు. ఓలాతో ఒప్పందం కారణంగా  వేలాదిమంది ఓలా డ్రైవర్లకు సేవలందించే అవకాశం లభించిందని మహీంద్రా ఫస్ట్ చాయిస్ సర్వీసెస్ సీఈఓ వైవిఎస్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. చెల్లింపుల టెక్నాలజీ సంస్థ జిప్‌క్యాష్‌లో కొంత వాటాను కొనుగోలు చేశామని ఓలా పేర్కొంది. సొంత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్‌ను ఏర్పాటులో భాగంగా  జిప్‌క్యాష్‌లో  ఓలా వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ మైనారిటీ వాటాను కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement