
హైదరాబాద్‌లో ఓలా షేరింగ్ సర్వీసులు...
ట్యాక్సీ అగ్రిగేటర్ ఓలా హైదరాబాద్‌లోనూ షేరింగ్ సర్వీసులను ప్రారంభించింది. ఒక వాహనంలో ఒకే మార్గంలో వేర్వేరు వ్యక్తులు ప్రయాణించడమే ఈ షేరింగ్. ఒక రైడ్‌లో ముగ్గురు దాకా వెళ్లొచ్చు. కస్టమర్లు ఓలా యాప్‌లో రైడ్ నౌ ద్వారా షేరింగ్ బటన్‌ను నొక్కి వెళ్లాల్సిన ప్రాంతం పేరు టైప్ చేస్తే చాలు. ఓలా షేర్‌లో అయ్యే చార్జీని ప్రయాణానికి ముందు డ్రైవర్‌కు చెల్లించాల్సిందే. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా ప్రయాణ చార్జీల్లో 50 శాతం వరకు ఆదా చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.