ముంబై: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ క్యాబ్ దిగ్గజం ఓలా క్యాబ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ ఉదృతి విస్తరిస్తున్న తరుణంలో కుటుంబ సమేతంగా ప్రయాణించే ఓలా షేర్ కేటగిరిని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనాను నివారించేందుకు సామాజిక దూరాన్ని పాటించాలన్న ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. చౌకగా ప్రయాణించే ఓలా షేర్‌ను తాత్కాలికంగా నిలిపేయడం వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని ఓలా అభిప్రాయపడింది.
కాగా ఓలాలోని వివిధ కేటగిరీలైన మైక్రో, మినీ, ప్రైమ్ సేవలు కొనసాగతాయని పేర్కొంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా దేశంలోను పంజా విసురుతోంది. ప్రస్తుతం సేవలందిస్తున్న క్యాబ్‌లలో పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకుంటామని ఓలా పేర్కొంది. కరోనా కారణంగా ఓలా క్యాబ్స్‌లాగే మిగతా క్యాబ్ సంస్థలు కూడా తాత్కాళికంగా నిలిపేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటి వరకు దేశంలో 271 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, నలుగురు మరణించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment