సాక్షి, హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రిక్ బస్‌ల తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ త్వరలో ఇంటర్ సిటీ కోచ్‌లను భారత్‌లో పరిచయం చేయనుంది. ఫిబ్రవరిలో ఢిల్లీలో జరుగనున్న ఆటో ఎక్స్‌పోలో ఈ మోడల్ బస్‌ను ఆవిష్కరించనుంది. 45 సీట్ల సామర్థ్యం ఉన్న ఈ కోచ్ ఒకసారి చార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తుంది. ఇంటర్ సిటీ కోచ్‌ల కోసం దక్షిణ భారతానికి చెందిన ఓ రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిన టెండర్లలో లోయెస్ట్ బిడ్డర్‌గా నిలిచామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఈడీ ఎన్.నాగ సత్యం ‘సాక్షి‘’ బిజినెస్ బ్యూరో ప్రతినిధికి వెల్లడించారు. ఇందులో భాగంగా 50 బస్‌లను సరఫరా చేయనున్నట్టు చెప్పారు. దేశంలో ఇంటర్ సిటీ కోచ్‌లను ప్రవేశపెట్టిన తొలి కంపెనీగా నిలుస్తామన్నారు. చైనాకు చెందిన బ్యాటరీ దిగ్గజం బీవైడీ సహకారంతో ఒలెక్ట్రా పలు మోడళ్లలో ఎలక్ట్రిక్ కోచ్‌లను తయారు చేస్తోంది. హైదరాబాద్‌లో కంపెనీకి ప్లాంటు ఉంది. ఫేమ్–2లో భాగంగా ఒలెక్ట్రా 655 బస్‌లకు ఆర్డర్లను దక్కించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment