తమ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తగ్గించిన మూలం వద్ద పన్ను
న్యూఢిల్లీ: తమ ఉద్యోగుల వేతనాలకు సంబంధించి తగ్గించిన మూలం వద్ద పన్ను (టీడీఎస్)ను ప్రభుత్వానికి చెల్లించడంలో విఫలమైన యజమాన్యం విషయంలో మూడు నెలల నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) స్పష్టం చేసింది. ఆయా అంశాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక వార్షిక సర్క్యులర్‌ను విడుదల చేసింది.