
సాక్షి, న్యూఢిల్లీ : ఇప్పటికే పలు మార్కెట్లలో సంచలనాలు సృష్టిస్తున్న యోగా గురు రాందేవ్ బాబా, ఈ-కామర్స్ మార్కెట్‌పైనా కన్నేశారు. త్వరలోనే ఈ-కామర్స్ పరిశ్రమలోకి అడుగుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులను ఈ-కామర్స్ ఇండస్ట్రిలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఎనిమిది దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీలతో జతకట్టాలని కంపెనీ చూస్తోందని తెలిసింది.
''భారీ మొత్తంలో ఆన్‌లైన్ పుష్ కోసం పతంజలి ఆయుర్వేదం పనిచేయడం ప్రారంభించింది. త్వరలోనే ప్రపంచంలో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం జరుగుతుంది. పలు పోర్టల్స్‌లో పతంజలి ఉత్పత్తుల ఆన్‌లైన్ షాపింగ్, కొత్త చాప్టర్ ప్రారంభమవుతుంది'' అని రాందేవ్ బాబా అధికార ప్రతినిధి ఎస్‌కే టిజరవాలా ట్విట్టర్ అకౌంట్‌లో చెప్పారు. అంతర్జాతీయ కంపెనీలకు గట్టి పోటీగా డైపర్, శానిటరీ నాప్‌కిన్ పరిశ్రమలోకి ప్రవేశించనున్నట్టు కూడా డిసెంబర్ 26న కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. పతంజలి అత్యంత వేగవంతంగా అభివృద్ది చెందుతున్న కంపెనీల్లో ఒకటి. గతేడాది ఫోర్బ్స్ మ్యాగజైన్ వార్షిక ఇండియా రిచ్ లిస్టులో 45వ స్థానంలో ఉన్న పతంజలి కంపెనీ, ఈ ఏడాది 19వ స్థానంలోకి ఎగిసింది.
Comments
Please login to add a commentAdd a comment