దేశ ప్రగతికి చిన్న సంస్థలు కీలకం: ప్రధాని | PM calls for private sector participation to make initiatives for MSMEs success | Sakshi
Sakshi News home page

దేశ ప్రగతికి చిన్న సంస్థలు కీలకం: ప్రధాని

Published Sun, Mar 2 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM

దేశ ప్రగతికి చిన్న సంస్థలు కీలకం: ప్రధాని

దేశ ప్రగతికి చిన్న సంస్థలు కీలకం: ప్రధాని

చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మెరుగ్గా ఉంటేనే దేశం వేగవంతంగా సమ్మిళిత వృద్ధి సాధించగలదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు.

న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) మెరుగ్గా ఉంటేనే దేశం వేగవంతంగా సమ్మిళిత వృద్ధి సాధించగలదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలకు నవ్యమైన పరిష్కారాలను అందించాలని పరిశ్రమ సమాఖ్యలకు ఆయన సూచించారు. తదనుగుణంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వానికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని పేర్కొన్నారు.

శనివారం జరిగిన ఎంఎస్‌ఎంఈ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ఆయా రంగాల్లో ఉత్తమ పనితీరు కనపర్చిన కంపెనీలు, బ్యాంకులకు ప్రధాని 37 పురస్కారాలు అందజేశారు. మరోవైపు, ఎంఎస్‌ఎంఈలు వ్యాపార విస్తరణలో పరస్పరం సహకరించుకునేందుకు ఉపయోగపడేలా వ ర్చువల్ క్లస్టర్ అప్రోచ్ పేరిట వర్చువల్ నెట్‌వర్క్‌ను ఎంఎస్‌ఎంఈ శాఖ ప్రారంభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement