ఆస్తి మీది.. బాధ్యత మాది | property management services | Sakshi
Sakshi News home page

ఆస్తి మీది.. బాధ్యత మాది

Published Fri, May 12 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 11:00 AM

ఆస్తి మీది.. బాధ్యత మాది

ఆస్తి మీది.. బాధ్యత మాది

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో తన పేరిట ఉన్న ఫ్లాట్‌కు సంబంధించిన అద్దె సొమ్ము ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ఎన్నారై శ్రీకాంత్‌కు ప్రతి నెలా ఠంచనుగా అందుతోంది. ఆస్తి, స్థానిక బిల్లులూ సకాలంలో చెల్లించేస్తున్నాడు కూడా. ఇదంతా ప్రాపర్టీ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌) పని! పీఎంఎస్‌ అని ముద్దుగా పిలిచే ఈ సేవల ద్వారా కలిగే ప్రయోజం అంతా ఇంతా కాదు. ప్రతి పనిని దగ్గరుండి ఈ ప్రతినిధులే చూసుకుంటారు. ఏయే సేవల్ని వీరు అందిస్తారో ఒకసారి చూద్దామా...

► నెల వచ్చేసరికి ఠంచనుగా అద్దె చెల్లించగల వ్యక్తులకే మీ ఇంటిని లేదా ఫ్లాట్‌ను అద్దెకిస్తారు. ఇందుకు సంబంధించి మీకు అద్దెదారునికి మధ్య ఒప్పందమూ కుదురుస్తారు. దీనికి అవసరమైన పత్రాల్ని రూపొందించే బాధ్యత వీరిదే. అద్దెదారులు పాటించాల్సిన నియమ నిబంధనల్ని మీ తరపున ఖరారు చేస్తారు.
►   క్రమం తప్పకుండా అద్దె వసూలు చేసి మీ బ్యాంకు ఖాతాలో జమ చేయటం వీరి సేవలో భాగమే. మీది ఫ్లాట్‌ అయితే అపార్టుమెంట్‌ సంఘానికి ప్రతినెలా నిర్వహణ ఖర్చులను ఇంటి అద్దె నుంచి చెల్లిస్తారు.
► ప్లంబింగ్, విద్యుత్, డ్రైనేజీ, నీటి సరఫరా తదితర సమస్యలు వస్తే వాటికి తగిన మరమ్మతులు చేయిస్తారు. అవసరమైన సందర్భాలలో మీ ఖర్చుతో ఇంటికి రంగులు వేయిస్తారు. విద్యుత్‌ బిల్లులు, ఆస్తి, స్థానిక సంస్థల పన్నులనూ చెల్లించేస్తారు.
► మీకు అద్దెదారునికి మధ్య వివాదం వస్తే సామరస్యంగా పరిష్కరించే బాధ్యత వీరిదే. నిర్వహణకు సంబంధించి జరిగే అన్ని సమావేశాలకు మీ ప్రతినిధిగా హాజరవుతారు.
► మీరు కోరుకున్నట్లయితే ఆస్తి అమ్మకంలో సహకరిస్తారు. మంచి ధరను ఇప్పించేందుకు కృషి చేస్తారు. పని ఏదైనా మీకు తెలియకుండా జరగదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతిసేవకు ఎంతోకొంత రుసుము చెల్లించాల్సిందే. ఏడాదికి ఒక నెల మీ ఫ్లాట్‌ అద్దెను ఫీజుగా వసూలు చేస్తారు. అయితే సంస్థను బట్టి వసూలు చేసే రుసుముల్లో వ్యత్యాసం ఉంటుందని మర్చిపోవద్దు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement