75వేల మంది భారతీయులు వెనక్కి | Proposed tweak in H-1B visa rules may deport upto 75,000 Indian workers  | Sakshi
Sakshi News home page

75వేల మంది భారతీయులు వెనక్కి

Published Tue, Jan 2 2018 2:21 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Proposed tweak in H-1B visa rules may deport upto 75,000 Indian workers  - Sakshi

'' బై అమెరికన్‌, హైర్‌ అమెరికన్‌'' విజన్‌ కోసం ట్రంప్‌ కార్యాలయం తీసుకునే నిర్ణయాలతో భారీ మొత్తంలో భారతీయ వర్కర్లు వెనక్కి తిరిగి రావాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యురిటీ(డీహెచ్‌ఎస్‌) ప్రతిపాదనలతో, హెచ్‌-1బీ వీసాలు కఠినతరం కావడం, గ్రీన్‌ కార్డు అప్లికేషన్లు పెండింగ్‌లో పడటం వంటివి చోటుచేసుకుంటున్నాయి. దీంతో వేలకొద్దీ భారతీయ ఉద్యోగులు అమెరికా నుంచి భారత్‌కు వచ్చేయాల్సిన పరిస్థితి వస్తుందని తెలుస్తోంది. ఎక్కువగా ఐటీ రంగంపై ఈ ప్రభావం ఉండనున్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

భారతీయ వర్కర్లకు హెచ్‌-1బీ వీసాల అప్లికేషన్లకు గడువు పొడిగింపు కష్టతరం కావడంతో పాటు, శాశ్వత సభ్యత్వం కోసం పొందే  గ్రీన్‌కార్డులు దరఖాస్తులు పెండింగ్‌లు పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటివరకున్న నిబంధనలతో గ్రీన్‌ కార్డు ఆమోదం పొందలేని పక్షంలో హెచ్‌-1బీ వీసాలకు రెండు మూడేళ్ల పొడిగింపును ట్రంప్‌ కార్యాలయం చేపడుతోంది. కానీ డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదనలతో హెచ్‌-1బీ వీసాల పొడిగింపు కష్టతరంగా మారుతోంది. దీంతో 50వేల నుంచి 75 వేల వరకు భారతీయ హెచ్‌-1బీ వీసా హోల్డర్స్‌ తిరిగి స్వదేశానికి రావాల్సి వస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. వీసా సంబంధిత సమస్యలపై సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రి బాడీ నాస్కామ్‌, అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్‌, అడ్మినిస్ట్రేషన్‌తో ఎప్పడికప్పుడూ చర్చలు జరుపుతూనే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement