హెచ్పీజీ చైర్మన్గా పీవీ రావు నియామకం | PV Rao to head body on pre-engineered building technology | Sakshi
Sakshi News home page

హెచ్పీజీ చైర్మన్గా పీవీ రావు నియామకం

Published Fri, Apr 15 2016 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 10:00 PM

హెచ్పీజీ చైర్మన్గా పీవీ రావు నియామకం

హెచ్పీజీ చైర్మన్గా పీవీ రావు నియామకం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హై పవర్డ్ గ్రూప్ (హెచ్‌పీజీ) చైర్మన్‌గా పెన్నార్ ఇంజనీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ లిమిటెడ్ (పెబ్స్ పెన్నార్) ఎండీ పీవీ రావు నియమితులయ్యారు. ప్రీ-ఇంజనీరింగ్ బిల్డింగ్స్ (పీఈబీ) టెక్నాలజీ పాలసీ రూపకల్పన, ప్రచారం కోసం హెచ్‌పీజీ పనిచేస్తుందని ది కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (సీఐడీసీ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా పీవీ రావు మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పీఈబీ టెక్నాలజీ అవసరాన్ని గుర్తించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎందుకంటే పీఈబీతో నిర్మాణాలు వేగవంతమవ్వటమే కాకుండా తక్కువ ధరతో నాణ్యమైన నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. మౌలిక రంగానికి ఈ పీఈబీ టెక్నాలజీ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement