నాస్కామ్‌ కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌ | Quatrro's Raman Roy is new Nasscom chief, Rishad Premji appointed vice chairman | Sakshi
Sakshi News home page

నాస్కామ్‌ కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌

Published Thu, Apr 6 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

నాస్కామ్‌ కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌

నాస్కామ్‌ కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌

వైస్‌ చైర్మన్‌గా రిషద్‌ ప్రేమ్‌జీ నియామకం
న్యూఢిల్లీ: ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్‌ కొత్త చైర్మన్‌గా రామన్‌ రాయ్‌ నియమితులయ్యారు. క్వాట్రో సీఎండీగా ఉన్న ఈయన 2017–18 ఆర్థిక సంవత్సరానికి గానూ నాస్కామ్‌ చీఫ్‌గా కొనసాగుతారు. అలాగే నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గా రిషద్‌ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. అజీమ్‌ ప్రేమ్‌జీ కుమారుడైన ఈయన విప్రో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌గా ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో నాస్కామ్‌ వైస్‌ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన రామన్‌ రాయ్‌ నేటి నుంచి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. కాగా టెక్‌ మహీంద్రా ఎండీ, సీఈవో అయిన సి.పి.గుర్నానీ నుంచి రామన్‌ రాయ్‌ బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక నాస్కామ్‌ ప్రెసిడెంట్‌గా ఆర్‌.చంద్రశేఖర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement