'ఇతర మార్కెట్ల కంటే మనమే బెటర్'
ముంబై: స్టాక్ మార్కెట్ల పతనంపై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇతర ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారత్ చాలా మెరుగైన స్థితిలో ఉందని చెప్పారు. భారత్ వద్ద 355 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నట్టు తెలిపారు. సోమవారం ముంబైలో జరిగిన బ్యాంకింగ్ సమావేశంలో రాజన్ మాట్లాడారు.
పెట్రోల్, డీజిల్ ధరలు మరో ఏడాది లేదా రెండేళ్ల పాటు కనిష్ట స్థాయిలో ఉంటాయని రాజన్ అభిప్రాయపడ్డారు. భారత ఆర్థిక రంగంలో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందని అన్నారు. కొత్త ప్రాజెక్టులను వేగవంతంగా చేపట్టాలని సూచించారు. కొత్త బ్యాంకులకు లైసెన్స్లు మంజూరు చేశామని రాజన్ తెలిపారు.