జైట్లీతో ఆర్‌బీఐ గవర్నర్ భేటీ
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ మంగళవారం సమావేశమయ్యారు. పలు ఆర్థిక అంశాలపై వీరిరువురి మధ్యా చర్చ జరిగినట్లు భావిస్తున్నారు. కాగా ఇది మామూలుగా జరిగే సమావేశమేనని జైట్లీతో సమావేశం అనంతరం రాజన్ అన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరపనుంది. రిటైల్ ద్రవ్యోల్బణం నవంబర్‌లో 14 నెలల గరిష్ట స్థాయి 5.41 శాతానికి ఎగయడం, వేతనాల పెంపు నేపథ్యంలో 3.9 శాతం వద్ద (జీడీపీలో) ద్రవ్యలోటు కట్టడి లక్ష్య సాధనపై అనుమానాలు, ఎనిమిది పారిశ్రామిక రంగాల గ్రూప్ 2015 నవంబర్‌లో 2014 నవంబర్‌తో పోల్చిచూస్తే...
ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 1.3 శాతం క్షీణత (మైనస్), తయారీ రంగం డిసెంబర్‌లో భారీగా పడిపోయిందని వివిధ సంస్థల అంచనాలు, చైనాలో మందగమనంపై తాజా ఆందోళనలు... తత్సంబంధ అంశాల నేపథ్యంలో జరిగిన తాజా జైట్లీ-రాజన్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.